జూలై మొదటి వారంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు వేదికగా హైదరాబాద్‌ను ఎంపిక చేశారు కమలనాథులు. దీనికి సంబంధించి తరుణ్ చుగ్, బీఎల్ సంతోష్‌లు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. 

హైదరాబాద్‌లో (hyderabad) బీజేపీ (bjp) జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే అవకాశం వుంది. వచ్చే నెలలో మూడు రోజుల పాటు సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది. ఇందుకోసం హెచ్ఐసీసీని (hicc) వేదికగా ఎంపిక చేశారు ఆ పార్టీ నేతలు. బీజేపీ నేతలు తరుణ్ చుగ్ (tarun chugh) , బీఎల్ సంతోష్‌లు (bl santosh) ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరికాసేపట్లో సన్నాహాక సమావేశం జరగనుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి నేతలతో జాతీయ నాయకులు ఏర్పాట్లపై చర్చించారు. జూలై మొదటి వారంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు వుంటే.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా పడే అవకాశం వుంది.