Asianet News TeluguAsianet News Telugu

Teenmar Mallanna తీరుపై BJP మండిపాటు..

తీన్మార్‌ మల్లన్నపై సొంతపార్టీ బీజేపీ సీరియ‌స్ అయిన‌ట్టు సమాచారం. ఈ వ్యవహారాన్ని ఖండిస్తూనే .. ఘటనపై బీజేపీ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విష‌యంపై బీజేపీ మీడియా థర్డ్ గ్రేడ్ నాయకులు తన పిల్లలపై నీచ వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
 

BJP National Senior Leader Serious Over Teenmar Mallanna Body Shaming Comments on KTR Son
Author
Hyderabad, First Published Dec 25, 2021, 9:13 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తీన్మార్‌ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ వ్య‌వ‌హర శైలిపై సొంతపార్టీ బీజేపీ సీరియ‌స్ అయిన‌ట్టు స‌మాచారం. ఆయ‌న వ్యాఖ్యలపై బీజేపీ నాయకత్వం ఆరా తీస్తోంది. కేటీఆర్ కుటుంబ సభ్యులను వ్య‌క్తిగ‌తంగా విమర్శించడంపై పార్టీ అధిష్టానం సీరియ‌స్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో బీజేపీ నాయ‌కులు తీన్మార్‌ మల్లన్నకు వార్నింగ్‌ ఇచ్చే ఆలోచనలో ప‌డ్డారు. వ్యక్తిగత విమర్శలు చేయ‌డం బీజేపీ  సిద్ధాంతం కాదని సీరియ‌స్ అయిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షును ఉద్దేశిస్తూ నిర్వహించిన ఓ పోల్‌ ప్రశ్న తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. 

 హిమాన్షుపై బాడీ షేమింగ్‌పై పాల్పడ్డాడంటూ టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఈ క్ర‌మంలో తీన్మార్ మల్లన్న కార్యాలయంపై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి య‌త్నించారు. ఇక తీన్మార్‌ మల్లన్నపై బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్లో కేసు న‌మోద‌య్యింది.  కేటీఆర్‌ కుమారుడు హిమాన్షును కించ‌ప‌రుస్తూ..  అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్‌ఎస్‌ ఐటీ సెల్‌ కంప్లైంట్ చేసింది. జైలుకెళ్లొచ్చిన మల్లన్న ప్రవర్తనలో మార్పు రాలేదని, రాజకీయాల్లోకి పిల్లల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని టీఆర్ఎస్ నేతలు నిలదీస్తున్నారు. మల్లన్నపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసింది.  మ‌రో వైపు మ‌ల్ల‌న్న కూడా .. త‌నపై తెరాస నేత‌లు దాడి చేశారంటూ మేడిపల్లి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Read Also: BJP ని బ‌లోపేతం చేయండి.. ప్ర‌ధాని మోడీ పిలుపు.. Party Fund గా ₹ 1,000 ల‌ విరాళం

మరోవైపు ఈ వ్య‌వ‌హారంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీజేపీ నాయ‌కులు గ్రేడ్ నాయకులు నాయ‌కుల‌ని,  పిల్లలపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వాక్ స్వాతంత్రం ఉంద‌ని, భావ‌వ్య‌క్తీక‌ర‌ణ స్వేచ్ఛ ఉంద‌నీ ఇష్టానూసారంగా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని హెచ్చ‌రించారు.  తాము చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ బీజేపీ నేతలకు నేర్పించేది ఇదేనంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  త‌న కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం అతడి శరీరాకృతిని అవమానించడం సంస్కారమేనా..? అంటూ మంత్రి ప్రశ్నించారు. అలాగే.. ప్ర‌ధాని మోదీ, అమిత్ షా కుటుంబాలను విమ‌ర్శిస్తే.. స‌హిస్తారా ? అని ట్వీట్‌లో మంత్రి ప్రశ్నించారు.


ఈ వ్యవ‌హ‌రంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ సైతం తీవ్రంగా స్పందించారు. పిల్లల్ని రాజకీయాల్లోకి లాగడం దుర్మార్గమని, ఈ చ‌ర్య వెనుక బీజేపీ కుట్ర ఉంద‌ని ఆరోపించారు.  బీజేపీ విష‌ సంస్కృతికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న పద్ధతి మార్చుకోకపోతే చెప్పుదెబ్బలు పాల‌వుతాడ‌ని హెచ్చరించారు.

Read Also: Atal Bihari Vajpayee జయంతి.. ప్రముఖుల నివాళులు... సేవల్ని స్మరించుకున్న నేతలు

మరోవైపు  ఈ వ్య‌వ‌హ‌రంపై బీజేపీని,  తీన్మార్ మ‌ల్ల‌న్న‌ను టీఆర్‌ఎస్ నేత‌లు ఏకీప‌డేస్తున్న విష‌యం తెలిసిందే.. తీన్మార్ మ‌ల్ల‌న్న చేసిన‌వి  వ్యక్తి గత కామెంట్సేన‌నీ.. ఇలాంటి చేష్టల్ని పార్టీ  అస‌లుఊ సహించబోదని చెప్తోంది. రాజకీయ ప్రత్యర్థులైనప్పటికీ..  వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లకు పాల్ప‌డితే..  అంగీకరించబోమని స్పష్టం చేసింది. బీజేపీ నేత‌లూ ఎవ‌రైనా స‌రే.. వ్యక్తిగత విమర్శలకు దూరం ఉండాలని.. తీన్మార్ మ‌ల్ల‌న్న చేసింది త‌ప్పేన‌నీ విమ‌ర్శించిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై చర్యలు తీసుకుంటుందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Read Also: వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు గుడ్ న్యూస్.. ఇక అలాంటి పోస్టులను వెంటనే డిలీట్ చేయొచ్చు..

తీన్మార్‌ మల్లన్న త‌న మీడియా సంస్థ  క్యూ న్యూస్ ఛాన‌ల్లో కల్వకుంట్ల హిమాన్షు ను ప్ర‌స్త‌విస్తూ.. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరిగింది.. భద్రాచలం గుడిలోనా..? హిమాన్షు శరీరంలోనా..?’ అంటూ తీన్మార్‌ మల్లన్న ఓ పోల్‌ క్వశ్చన్‌ను పోస్ట్ చేశారు. బాడీషేమింగ్‌తో కూడిన ఆ పోస్ట్‌ తీవ్ర దుమారం రేపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios