Asianet News TeluguAsianet News Telugu

BJP ని బ‌లోపేతం చేయండి.. ప్ర‌ధాని మోడీ పిలుపు.. Party Fund గా ₹ 1,000 ల‌ విరాళం

బీజేపీని బలోపేతం చేయండ‌ని ప్ర‌ధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ మేర‌కు దేశ‌వ్యాప్తంగా పార్టీ ఫండ్ సేక‌ర‌ణ కార్యక్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం డిసెంబ‌ర్ 25 నుంచి ఫిబ్ర‌వ‌రి 11 వ‌ర‌కు కొన‌సాగనున్న‌ది. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ తన స్వంత ఖాతా నుండి ₹ 1,000 విరాళంగా ఇచ్చారు.
 

Help Make BJP And India Strong  PM Donates   Party Fund
Author
Hyderabad, First Published Dec 25, 2021, 4:09 PM IST

బీజేపీ, భారతదేశాన్ని బలోపేతం చేయండ‌ని ప్ర‌ధాని మోడీ పిలుపునిచ్చారు. ప్ర‌ధాని త‌న వంతు స‌హాయంగా బీజేపీ పార్టీ ఫండ్‌కి ₹ 1,000 విరాళం ఇచ్చారు.  మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా బీజేపీ సూక్ష్మ విరాళాల ( పార్టీ ఫండ్) సేక‌ర‌ణ‌ను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం డిసెంబ‌ర్ 25 నుంచి ఫిబ్రవరి 11 వరకు కొనసాగుతుందని ప్రధాని తెలిపారు. 

Read Also: Atal Bihari Vajpayee జయంతి.. ప్రముఖుల నివాళులు... సేవల్ని స్మరించుకున్న నేతలు

భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని బ‌లోపేతం చేయడానికి బీజేపీ మ‌ద్ద‌తు దారులు, కార్య‌కర్త‌లు పార్టీ ఫండ్‌కు చిన్న మొత్తాలను విరాళంగా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. భారతీయ జనతా పార్టీ పార్టీ ఫండ్ గా తన స్వంత ఖాతా నుండి రూ. 1,000 విరాళమిచ్చాన‌ని తెలిపారు. ఎప్పుడూ భార‌త్ ను, బీజేపీని మొద‌టి స్థానంలో చూడాల‌నేది త‌న కోరిక‌గా పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంతో  పార్టీ క్యాడర్ లో కొత్త ఉత్స‌హాం వ‌స్తోంది.  బీజేపీని బలోపేతం చేయడానికి సూక్ష్మ విరాళాలు చేయండంటూ త‌న విరాళాల ర‌శీదును జ‌త చేసి ట్వీట్ చేశారు ప్ర‌ధాని మోడీ. ఈ కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌లకు బీజేపీ మ‌రింత చేరువవుతోంద‌నీ,  దేశ నిర్మాణానికి నిస్వార్థంగా అంకితభావంతో ఉన్న లక్షలాది మంది కార్యకర్తలను ఈ కార్య‌క్ర‌మం ఉత్సాహపరుస్తోంద‌ని ప్రధాని  త‌న‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

Read Also: జమ్మూ కశ్మీర్ లో కొసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత.. ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..
 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా త‌మ విరాళాల‌ను ప్ర‌క‌టించారు. బీజేపీ మద్దతుదారులు, కార్యకర్తలందరూ విరాళాలు అందించి, ఇతరులకు స్ఫూర్తినివ్వమని విజ్ఞప్తి చేస్తున్నని  అమిత్ షా త‌న ట్వీట్ లో తెలిపారు. అలాగే.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ₹ 1,000 విరాళం ఇచ్చారు. ఆయ‌న నమో యాప్ ద్వారా పార్టీ పంఢ్ చెల్లించినట్టు తెలిపారు.  బీజేపీని బలోపేతం చేయడంలో భాగంగా విన‌య పూర్వకంగా తాను పార్టీ  ఫండ్ చెల్లించిన‌ట్టు పేర్కొన్నారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికి బిజెపిని శక్తివంతం చేయవచ్చని  నడ్డా ట్వీట్ చేశారు.  బీజేపీని బలోపేతం చేయడానికి .. ప్రజల మ‌ద్ద‌తు కావాల‌ని అన్నారు.  ₹5 నుండి ₹1,000 వరకు విరాళాలు చెల్లించ‌వ‌చ్చ‌ని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios