Asianet News TeluguAsianet News Telugu

ఏపీపై ప్రేముంటే.. విశాఖకు బయ్యారం గనులివ్వండి: కేటీఆర్‌కు బీజేపీ నేత సత్యకుమార్ సవాల్

ఏపీపై కేటీఆర్‌కు ప్రేమ వుంటే తెలంగాణలో వున్న బయ్యారం గనులకు కేటాయించాలన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. విశాఖ ఉక్కుకు మద్ధతు అంటూ కబుర్లు చెప్పకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి ఉక్కు పరిశ్రమను కొనుగోలు చేసి నడపాలని ఆయన సూచించారు.

bjp national secretary satya kumar slams minister ktr over vizag steel plant privatization ksp
Author
Hyderabad, First Published Mar 13, 2021, 4:55 PM IST

ఏపీపై కేటీఆర్‌కు ప్రేమ వుంటే తెలంగాణలో వున్న బయ్యారం గనులకు కేటాయించాలన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. విశాఖ ఉక్కుకు మద్ధతు అంటూ కబుర్లు చెప్పకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి ఉక్కు పరిశ్రమను కొనుగోలు చేసి నడపాలని ఆయన సూచించారు.

ఆంధ్రులను తరిమికొడతామన్న కేటీఆర్ విశాఖ ఉక్కుకు మద్ధతుగా మాట్లాడటం హాస్యాస్పదంగా వుందన్నారు సత్యకుమార్.  ఈ విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చిత్తశుద్ధిగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. తద్వారా ఉద్యోగస్తులకు, ప్రజలకు అండగా నిలబడాలని ఆయన హితవు పలికారు. 

అంతకుముందు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై మండిపడ్డారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. జర్నలిస్టులపై ప్రేమ వలకబోసిన ట్విట్టర్ పిట్ట.. వారిని కత్తితో పొడిస్తే ఎందుకు స్పందించలేదని నిలదీశారు.

Alsp Read:Editor Speaks: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ, కేటీఆర్ వ్యాఖ్యల వెనక...(Promo)

ఆంధ్రా ప్రాంత కార్పొరేట్ కంపెనీలు,  గ్రాడ్యుయేట్ల ఓట్ల కోసమే వైజాగ్ స్టీల్ ఫ్లాంట్‌ ఉద్యమంపై మంత్రి కేటీఆర్ ప్రేమ చూపిస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. ప్రైవేటీకరణ గురించి కేటీఆర్ మాట్లాడటం హ్యాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేశారు.

ఎన్నికలు వచ్చినప్పుడు కేంద్రంపై విమర్శలు చేయటం కేటీఆర్‌కు అలవాటుగా మారిందని రఘునందన్ రావు ధ్వజమెత్తారు. హరీష్‌రావు సిద్దిపేటకు మాత్రమే ఆర్థిక మంత్రా? లేక తెలంగాణ రాష్ట్రానికా అంటూ సెటైర్లు వేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios