హైదరాబాద్: టీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో తేలిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పారు.

శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చాలా అవినీతి పెరిగిపోయిందన్నారు. మార్పు రావాలనే ఉద్దేశ్యంతోనే ప్రజలు ఓటు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. 

also read:మౌలాలి డివిజన్‌లో నిలిచిపోయిన కౌంటింగ్: బ్యాలెట్ బాక్సులో 33 ఓట్లు అధికం

అవినీతి రహిత పాలనను ప్రజలు కోరుకొంటున్నారని ఎంపీ చెప్పారు. సీఎం కేసీఆర్ ఇంతవరకు సెక్రటేరియట్ వెళ్లలేదన్నారు. సచివాలయానికి వెళ్లని ముఖ్యమంత్రిగా అర్హుడా అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో రైతులు, మహిళలు, యువత, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను సీఎం కేసీఆర్ మోసం చేశారని అరవింద్ విమర్శించారు.  ఈ కారణంగానే ప్రజలు మార్పును కోరుకొంటున్నారన్నారు. 2023లో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. గతంలో కంటే ఈ దఫా మెరుగైన ఫలితాలను బీజేపీ సాధించనుందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. బల్దియా పీఠంపై కాషాయ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ ప్లాన్ చేసింది. బీజేపీ అగ్రనేతలు ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు.