నగరంలోని మౌలాలి డివిజన్ లో ఓట్ల లెక్కింపును అధికారులు శుక్రవారం నాడు నిలిపివేశారు. ఓ బ్యాలెట్ బాక్సులో పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు నమోదు కావడంతో ఓట్ల లెక్కింపును నిలిపివేశారు.
హైదరాబాద్: నగరంలోని మౌలాలి డివిజన్ లో ఓట్ల లెక్కింపును అధికారులు శుక్రవారం నాడు నిలిపివేశారు. ఓ బ్యాలెట్ బాక్సులో పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు నమోదు కావడంతో ఓట్ల లెక్కింపును నిలిపివేశారు.
ఈ డివిజన్‌లోని ఓ పోలింగ్ బూత్ లో పోలైన ఓట్ల కంటే 33 ఓట్లు అధికంగా ఉన్నాయి. పోలింగ్ రోజున 361 ఓట్లు పోలయ్యాయి. కానీ బ్యాలెట్ బాక్సులో మాత్రం 394 ఓట్లు ఉన్నాయి.ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు షాక్ తిన్నారు. పోలైన ఓట్ల కంటే బాలెట్ బాక్సులో ఎలా ఉన్నాయని అధికారులను కౌంటింగ్ ఏజంట్లు ప్రశ్నిస్తున్నారు.
పోలైన ఓట్ల కంటే బ్యాలెట్ బాక్సుల్లో అధిక ఓట్లు ఎలా నమోదయ్యాయనే విషయమై చర్చ సాగుతోంది.దీంతో ఈ డివిజన్ లో కౌంటింగ్ ను నిలిపివేశారు.నగరంలోని ఇతర చోట్లలో కూడ ఇదే విధమైన పరిస్థితి నెలకొంది.
కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్ లో కూడ అధికంగా ఓట్లు ఉన్నాయని బీజేపీ ఆందోళనకు దిగింది. ఇదే డివిజన్ లో బాలెట్ బాక్సులకు సీల్ లేని విషయాన్ని గుర్తించిన బీజేపీ కౌంటింగ్ ఏజంట్లు ఆందోళన నిర్వహించారు.
