నా గెలుపు చూసే బీజేపీలోకి ఈటల.. బండి సంజయ్‌కు అంత డబ్బు ఎక్కడిది?: రఘనందన్‌రావు సంచలనం
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొద్దిరోజులు అసంతృప్తి సర్వం వినిపిస్తున్నరఘునందన్ రావు.. సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించారు.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొద్దిరోజులు అసంతృప్తి సర్వం వినిపిస్తున్నరఘునందన్ రావు.. సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రఘునందన్ రావు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. రెండో సారి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తానని అన్నారు. తాను బీజేపీలోనే ఉండాలని అనుకుంటున్నానని తెలిపారు. దుబ్బాకలో తననే చూసే ప్రజలు ఓటేశారని చెప్పారు. తన గెలుపునే చూసే ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చారని అన్నారు. వందల కోట్లు ఖర్చు పెట్టినా మునుగోడులో గెలవదని చెప్పారు. అదే రూ. 100 కోట్లు తనకు ఇస్తే తెలంగాణను దున్నేసేవాణ్ణి అని అన్నారు.
కేసీఆర్ కొట్టే మొగోణ్ణి తానేనని జనాలు నమ్మారని చెప్పారు. రాజీనామా చేస్తే గెలిప్తా అని.. రాజగోపాల్ రెడ్డితో అమిత్ షా అన్నారని చెప్పుకొచ్చారు. అయితే మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని అమిత్ షా గెలిపించలేకపోయాడని అన్నారు. బండి సంజయ్‌ది స్వయంకృతాపరాధరం అని చెప్పారు. పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన బండి సంజయ్‌కు వంద కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చేంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. బీజేపీ ఇంచార్జ్‌లు తరుణ్ చుగ్, సున్సీల్ బన్సల్ బొమ్మలకు ఓట్లు పడవని.. రఘునందన్, ఈటల బొమ్మలుంటేనే బీజేపీకి జనాలు ఓట్లు వేస్తారని అన్నారు. పార్టీ గుర్తు అనేది చివరి అంశం అని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ మార్పుపై మీడియాలో వచ్చే వార్తలన్నీ నిజమేనని అన్నారు. రాష్ట్రంలో పార్టీకి శాసనసభపక్ష నేత లేడనే విషయం జేపీ నడ్డాకు తెలియదని అన్నారు.
Also Read: ప్రగతి భవన్ వద్దకు కేఏ పాల్.. అడ్డుకున్న పోలీసులు.. అందుకే వచ్చానంటూ కామెంట్స్..
బీజేపీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి లేదా శాసనసభపక్ష నేత లేదా జాతీయ అధికార ప్రతినిధి.. ఈ మూడింటిలో ఏదో ఒక పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదేళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నానని చెప్పారు. అధ్యక్ష పదవికి తానేందుకు అర్హుడిని కానని అన్నారు. కొన్ని విషయాల్లో తన కులమే తనకు శాపం కావచ్చని చెప్పారు. రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో తెలుస్తోందని అన్నారు.