Asianet News TeluguAsianet News Telugu

మెడికల్ కాలేజీల్లో నిగూఢంగా ర్యాగింగ్: మెడికో ప్రీతి కుటుంబ సభ్యులకు ఈటల పరామర్శ

వరంగల్  కేఎంసీ  మెడికో ప్రీతి  ఆత్మహత్యాయత్నానికి  పాల్పడిన  నిందితులను కఠినంగా  శిక్షించాలని  బీజేపీ ఎమ్మెల్యే  ఈటల రాజేందర్  చెప్పారు.

BJP MLA Etela Rajender Demands To Punish Saif in Medico Preethi Case
Author
First Published Feb 26, 2023, 5:34 PM IST | Last Updated Feb 26, 2023, 5:44 PM IST


హైదరాబాద్: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో  నిగూఢంగా  ఇంకా ర్యాగింగ్  సాగుతుందని  బీజేపీ ఎమ్మెల్యే  ఈటల  రాజేందర్  ఆరోపించారు. ఆదివారం నాడు  హైద్రాబాద్ నిమ్స్ లో  మాజీ మంత్రి ఈటల రాజేందర్  మెడికో ప్రీతిని  కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రీతికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన  మీడియాతో మాట్లాడారు. మెడికో ప్రీతి  ఘటనపై  సమగ్ర  విచారణ జరిపించాలని ఆయన డిమాండ్  చేశారు.  తనపై జరుగుతున్న వేధింపుల గురించి  పోలీసులకు  ప్రీతి  ఫిర్యాదు చేసినా కూడా ఫలితం లేకుండా  పోయిందన్నారు.   ప్రీతి ఘటనలో  పోలీసుల వైఫల్యం కూడా కొంత ఉందని  ఆయన ఆరోపించారు..మెడికో ప్రీతిని వేధించిన వారిని కఠినంగా  శిక్షించాలని  ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్  చేశారు. ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని  ఈటల రాజేందర్  కోరారు.  

మెడికల్ కాలేజీల్లో,  ప్రభుత్వ  ఆసుపత్రుల్లో  భారమంతా పీజీ విద్యార్ధులపైనే పడుతుందని  రాజేందర్ అభిప్రాయపడ్డారు. వైద్య కళాశాలలు పెరిగినంతగా  బోధనా సిబ్బంది పెరగలేదని ఆయన చెప్పారు.

ఈ నెల  22వ తేదీన  మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం  చేసుకుంది.   వరంగల్ కేఎంసీలో  మెడికో గా  ప్రీతి పనిచేస్తుంది.  సీనియర్  సైఫ్ వేధింపుల కారణంగానే  ఆమె ఆత్మహత్య చేసుకుందని  కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం  సైఫ్ ను పోలీసులు అరెస్ట్  చేసి రిమాండ్ కు తరలించారు.   సైఫ్ వేధింపుల కారణంగానే  మెడికో  ప్రీతి  ఆత్మహత్యాయత్నం  చేసుకుందని  పోలీసులు ప్రకటించారు.

సైఫ్ వేధింపుల గురించి  మెడికో ప్రీతి పేరేంట్స్   ప్రిన్సిపల్ కు ఫిర్యాదు  చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా  ప్రిన్సిపల్  సైఫ్, మెడికో ప్రీతిని పిలిపించి మాట్లాడారు. సైఫ్ వేధింపుల గురించి తల్లితో  మెడికో  మాట్లాడింది.ఈ ఆడియో సంభాషణ వెలుగు చూసింది.  

మెడికో ప్రీతి  ఆత్మహత్యాయత్నంపై  ప్రొఫెసర్ల బృందం  ప్రభుత్వానికి నివేదిక  ఇచ్చింది.  ఇప్పటికే సైఫ్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   సైఫ్ పై   ఆరోపణలు  రుజువైతే  ఆయనపై బహిష్కరణ  అస్త్రం కూడా ప్రయోగించే అవకాశం ఉందని  చెబుతున్నారు. 

also read:మెడికో ప్రీతి ఆరోగ్యంపై కాసేపట్లో హెల్త్ బులెటిన్: నిమ్స్ వద్ద సెక్యూరిటీ పెంపు

గత నాలుగు మాసాలుగా  ఉద్దేశ్యపూర్వకంగా  మెడికో ప్రీతిని లక్ష్యంగా  చేసుకొని సైఫ్ వేధింపులకు పాల్పడ్డారని వరంగల్ సీపీ రంగనాథ్  రెండు రోజుల క్రితం  ప్రకటించారు ఈ విషయమై  వాట్సాప్  చాటింగ్ లను  ఆధారాలుగా  ఆయన  చెప్పారు. తమ దర్యాప్తులో  వాట్సాప్ చాటింగ్ లను  గుర్తించినట్టుగా  ఆయన   వివరించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios