మెడికో ప్రీతి ఆరోగ్యంపై కాసేపట్లో హెల్త్ బులెటిన్: నిమ్స్ వద్ద సెక్యూరిటీ పెంపు

మెడికో  ప్రీతి ఆరోగ్య  పరిస్తితిపై  నిమ్స్ వైద్యులు   కాసేపట్లో  ప్రకటన చేయనున్నారు. దీంతో  నిమ్స్ వద్ద భద్రతను పెంచాలని  డైరెక్టర్  పోలీసులను కోరారు. 

nims To Release medico  Preethi  Health Bulletin


హైదరాబాద్: మెడికో ప్రీతి  ఆరోగ్య పరిస్థితిపై    కాసేట్లో   నిమ్స్ వైద్యులు  ప్రకటన చేయనున్నారు. దీంతో  నిమ్స్ వద్ద  భద్రతను పెంచాలని  కోరారు.ఈ మేరకు పోలీస్ సిబ్బందిని భారీగా మోహరించారు.  

గత ఐదు రోజులుగా  మెడికో ప్రీతి  నిమ్స్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతుంది.  ఈ నెల  22వ తేదీన వరంగల్ కేఎంసీలో  మెడికో  ప్రీతి  ఆత్మహత్యాయత్నం  చేసుకున్న విషయం తెలిసిందే. మెడికో ప్రీతి ఆరోగ్యం క్షీణించిందని  తండ్రి నరేందర్ మీడియాకు  చెప్పారు  ప్రీతి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని వైద్యులు  తమకు చెప్పారన్నారు.

వరంగల్ కేఎంసీలో  మెడికో గా  ప్రీతి పనిచేస్తుంది.  సీనియర్  సైఫ్ వేధింపుల కారణంగానే  ఆమె ఆత్మహత్య చేసుకుందని  కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం  సైఫ్ ను పోలీసులు అరెస్ట్  చేసి రిమాండ్ కు తరలించారు.   సైఫ్ వేధింపుల కారణంగానే  మెడికో  ప్రీతి  ఆత్మహత్యాయత్నం  చేసుకుందని  పోలీసులు అనుమానిస్తున్నారు.  సైఫ్ వేధింపుల గురించి  మెడికో ప్రీతి పేరేంట్స్   ప్రిన్సిపల్ కు ఫిర్యాదు  చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా  ప్రిన్సిపల్  సైఫ్, మెడికో ప్రీతిని పిలిపించి మాట్లాడారు. సైఫ్ వేధింపుల గురించి తల్లితో  మెడికో  మాట్లాడింది.ఈ ఆడియో సంభాషణ వెలుగు చూసింది.  

also read:మెడికో ప్రీతి ఆరోగ్యంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు

మెడికో ప్రీతి  ఆత్మహత్యాయత్నంపై  ప్రొఫెసర్ల బృందం  ప్రభుత్వానికి నివేదిక  ఇచ్చింది.  ఇప్పటికే సైఫ్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   సైఫ్ పై   ఆరోపణలు  రుజువైతే  ఆయనపై బహిష్కరణ  అస్త్రం కూడా ప్రయోగించే అవకాశం ఉందని  చెబుతున్నారు. 

గత నాలుగు మాసాలుగా  ఉద్దేశ్యపూర్వకంగా  మెడికో ప్రీతిని లక్ష్యంగా  చేసుకొని సైఫ్ వేధింపులకు పాల్పడ్డారని వరంగల్ సీపీ రంగనాథ్  రెండు రోజుల క్రితం  ప్రకటించారు ఈ విషయమై  వాట్సాప్  చాటింగ్ లను  ఆధారాలుగా  ఆయన  చెప్పారు. తమ దర్యాప్తులో  వాట్సాప్ చాటింగ్ లను  గుర్తించినట్టుగా  ఆయన   వివరించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios