బండి సంజయ్ అరెస్ట్: హైద్రాబాద్‌లో బీజేపీ నేతల మౌన దీక్ష

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ బీజేపీ నేతలు  హైద్రాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మౌన దీక్షకు దిగారు. రాజాసింగ్, డాక్టర్ లక్ష్మణ్, విజయశాంతి తదితరులు మౌన దీక్షలో పాల్గొన్నారు.

BJP leaders Conducts Mouna deeksha at Party Office in Hyderabad


హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi sanjay  అరెస్ట్ ను నిరసిస్తూ bjp తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో మౌన దీక్ష చేపట్టారు సీనియర్ నేతలు.  గోషామహల్ ఎమ్మెల్యే Raja singh, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్,  ఎండల లక్ష్మీనారాయణ,ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి సహా  పలువరు నేతలు మౌన దీక్షలో పాల్గొన్నారు.

317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగిన బండి సంజయ్ ను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా  పార్టీ కార్యాలయాల్లో మౌన దీక్షలకు దిగాలని ఆ పార్టీ  నిర్ణయం తీసుకొంది.

also read:బండి సంజయ్ అరెస్ట్, హైద్రాబాద్‌లో జేపీ నడ్డా ర్యాలీకి నో పర్మిషన్: తేల్చేసిన పోలీసులు

ఈ నిర్ణయం మేరకు  బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేతలు మౌన దీక్షను చేపట్టారు.  రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో  పార్టీ నేతలు ఈ దీక్షల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు బీజేపీ నేతలు మౌన దీక్షను ఎంచుకొన్నారు. మరోవైపు సాయంత్రం ఇవాళ క్యాండిల్ ర్యాలీకి కూడా బీజేపీ నాయకత్వం పిలపునిచ్చింది.

 బండి సంజయ్ బెయిల్ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు bail ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ ను  Karimnagar Court స్వీకరించింది. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.  సోమవారం నాడే బండి సంజయ్ తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో  ఇవాళ మరోసారి బెయిల్ పిటిషన్ ను బండి సంజయ్ తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. 

ఇవాళ ఈ బెయిల్ పిటిషన్ కు కోర్టు నెంబర్ ను కేటాయించనుంది.దీంతో ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. కరీంనగర్ పోలీసులు  బండి సంజయ్ పై తప్పుడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని కూడా సంజయ్ తరపు న్యాయవాదులు మరోసారి కోర్టు దృష్టికి తీసుకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా 333 సెక్షన్  కింద బండి సంజయ్ పై కేసులు నమోదు చేయడంపై కూడా పోలీసుల తీరును బండి సంజయ్ తరపు న్యాయవాదులు తప్పుబడుతున్నారు. ఈ విషయాన్ని కోర్టు ముందుకు తీసుకురానున్నారు.

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావును తూఫ్రాన్  టోల్‌గేట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ సాయంత్రం  హైద్రాబాద్ లో బీజేపీ క్యాండిల్ ర్యాలీకి అనుమతి లేనందున బీజేపీ నేతలను ఎక్కడికక్కడే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రఘునందన్ రావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇవాళ సాయంత్రం బీజేపీ తలపెట్టిన క్యాండిల్ ర్యాలీకి పోలీసులు అనుమతిని నిరాకరించారు. కరోనా నేపథ్యంలో సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని హైద్రాబాద్ పోలీసులు ప్రకటించారు. ఇవాళ ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios