Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్‌లో చేరిన రాపోలు ఆనంద భాస్కర్... కేంద్రంపై కేటీఆర్ ఆగ్రహం

బీజేపీ నేత రాపోలు ఆనంద భాస్కర్ మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. రాష్ట్రంలో నేతన్నకు చేయూత, చేనేత లక్ష్మీ పేరుతో కార్మికులను ఆదుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు.  వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌కు కేంద్రం ఒక్కపైసా కూడా సాయం చేయడం లేదని ఆయన ఫైర్ అయ్యారు. 

bjp leader rapolu ananda bhaskar joining in trs
Author
First Published Oct 26, 2022, 7:06 PM IST

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. బీజేపీ నేత రాపోలు ఆనంద భాస్కర్ బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా గులాబీ కండువా కప్పి ఆయనను కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి అందించేది చేనేత రంగమేనన్నారు. చేనేతకు చేయూతనిస్తే అద్భుతాలు చేయొచ్చునని కేటీఆర్ పేర్కొన్నారు. 

అద్భుత ప్రతిభ వున్న చేనేత కళాకారులు దేశంలో లక్షలాది మంది వున్నారని మంత్రి తెలిపారు. నేతన్నకు బీమాతో టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా వుంటుందని ఆయన చెప్పారు. వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌కు కేంద్రం ఒక్కపైసా కూడా సాయం చేయడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత , పవర్ లూమ్ కార్మికుల కోసం కేసీఆర్ పలు పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో నేతన్నకు చేయూత, చేనేత లక్ష్మీ పేరుతో కార్మికులను ఆదుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు.  చేనేత కార్మికులకు పలు అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని మంత్రి గుర్తుచేశారు. 

ALso REad:చేనేత కళాకారుల డిజైన్లు కాపీ కొడితే లోపలేయిస్తా : పద్మశాలి సభలో కేటీఆర్ హెచ్చరికలు

అంతకుముందు గత శుక్రవారం మన్నెగూడలో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువమందికి జీవనోపాధిని అందిస్తున్నది చేనేత రంగమేనని ఆయన తెలిపారు. కేసీఆర్‌కు చిన్నప్పటి నుంచే చేనేత కార్మికుల కష్టాలు తెలుసునని మంత్రి వెల్లడించారు. 2002లో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కోసం కేసీఆర్ స్వయంగా జోలెపట్టి విరాళాలు సేకరించారని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.లక్ష చొప్పున అప్పగించారని.. 2007లో కరీంనగర్ ఎంపీగా చేనేత కార్మికుల ఆత్మహత్యలను నివారించేందుకు రూ.50 లక్షల నిధులను ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రూ.70 కోట్లుగా వున్న చేనేత బడ్జెట్‌ను ఏకంగా రూ.1200 కోట్లకు పెంచారని తెలిపారు. 

గడిచిన ఎనిమిదేళ్లలో చేనేత శాఖకు ఇప్పటి వరకు రూ.5,752 కోట్లని కేటీఆర్ చెప్పారు. ప్రతీ ఏటా కేటాయింపులు పెంచుకుంటూ వస్తున్నామని.. చేనేత కళాకారుల డిజైన్లను ఎవరైనా కాపీ కొడితే కఠిన చర్యలు తీసుకుని లోపలేయిస్తామని మంత్రి హెచ్చరించారు. అవసరమైతే చట్టాలను మార్చేలా బాధ్యత తీసుకుంటామని.. చేనేత మిత్ర పథకం కింద నూలు, రసాయనాలపై 40 శాతం సబ్సిడీ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ ఒక్కటేనని కేటీఆర్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios