బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌కు స్టేషన్ బెయిల్.. వెలుగులోకి మరో వీడియో..!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై దుండిగల్ పోలీసుల క్రిమినల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

BJP Leader Bandi Sanjay sons Bandi Bhagirath gets Station Bail in assault on college mate case

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై దుండిగల్ పోలీసుల క్రిమినల్ కేసు నమోదు చేశారు. భగీరథ్ మరో విద్యార్థిపై దాడి చేసిన వీడియో వెలుగులోకి రావడం తీవ్ర సంచలనగంగా మారింది. అందులో భగీరథ్.. మరో విద్యార్థిని బూతులు తిడుతూ, కొట్టడం కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి మహీంద్రా యూనివర్శిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దుండిగల్ పోలీసులు సాయి భగీరథ్‌పై ఐపీసీ సెక్షన్లు 323, 341, 504, 506 కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించి భగీరథ్ బుధవారం దుండిగల్ పోలీసులు ఎదుట హాజరయ్యారు. భగీరథ్ తన న్యాయవాది సమక్షంలో విచారణకు హాజరయినప్పటికీ పోలీసులు విచారణ చేయలేదు. దెబ్బలు తిన్నబాధితుడు శ్రీరామ్‌ను కూడా విచారణ చేయాల్సి ఉంటుందని అతని స్టేట్‌మెంట్ రికార్డు చేసిన తర్వాత తదుపరి విచారణ జరుగుతుందని పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే భగీరథ్ స్టేషన్ బెయిల్ వచ్చింది. ఈ కేసులో పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత తదుపరి విచారణకు రావాల్సి ఉంటుందని పోలీసులు భగీరథ్‌కు చెప్పినట్టుగా సమాచారం. 

 

అయితే ఈ వీడియో వైరల్ అయిన కొద్ది సేపటికే..  మరో యువకుడు సెల్ఫీ వీడియో రిలీజైంది. తన పేరు శ్రీరామ్ అని.. భగీరథ్ దాడి చేసింది తనపైనే అని చెప్పాడు. వైరల్ అవుతున్న వీడియో పాతది  అని పేర్కొన్నాడు. ‘‘నేను తెల్లవారుజామున 4 గంటలకు భగీరథ్ స్నేహితుడి సోదరికి కాల్ చేశాను. నన్ను ప్రేమించమని మెసేజ్ కూడా వేధించాను. ఈ విషయం భగీరథ్‌కు తెలియగానే నా దగ్గరకు వచ్చాడు. నేను అతనితో దురుసుగా మాట్లాడాను. అతను నాపై దాడి చేశాడు. ఏది ఏమైనా ఇప్పుడు అది అంతా గతం. మేము రాజీకి వచ్చాము. ఇప్పుడు మా మధ్య ఎటువంటి సమస్యలు లేవు. మేము దానిని విడిచిపెట్టాము. మేం స్నేహితులం, బ్యాచ్‌మేట్స్‌. ఇప్పుడు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు’’ అని ఆ యువకుడు పేర్కొన్నాడు. 

Also Read: దమ్ముంటే నాతో రాజకీయం చేయండి.. కుమారుడి ర్యాగింగ్ వీడియోపై బండి సంజయ్ కామెంట్స్

వెలుగులోకి మరో వీడియో... 
భగీరథ్‌కు సంబంధించి మరో వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ వీడియోలో కూడా ఓ విద్యార్థిని భగీరథ్ బూతులు తిడుతూ కొడుతున్నట్టుగా కనిపించింది. అయితే.. ఇందులో భగీరథ్‌తో అతని స్నేహితులంతా కలిసి ఓ విద్యార్థిని బూతులు తిడుతూ, విచక్షణారహితంగా కొడుతూ, కాలితో తన్నుతూ ఉండటం వీడియోలో కనిపిస్తోంది. అయితే వీడియోలో ఉన్న బాధిత అబ్బాయిని ఎందుకు కొట్టారనే విషయం తెలియాల్సి ఉంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios