మణిపూర్ హింసపై ఆశోక్ గెహ్లాట్ ట్వీట్: కౌంటరిచ్చిన బీజేపీ
మణిపూర్ లో చెలరేగిన హింసపై రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ చేసిన విమర్శలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి పెట్టాలని సూచించారు.
జైపూర్: మణిపూర్ లో చెలరేగిన హింసపై రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ చేసిన ట్వీట్ పై బీజేపీ నేతలు మండిపడ్డారు.మణిపూర్ లో హింసాకాండ ఆగకపోవడాన్ని చాలా బాధాకరమన్నారు. మణిపూర్ హింసతో దేశం మొత్తం ఆందోళన చెందుతుందన్నారు. బీజేపీ నిర్లక్ష్యంతో మణిపూర్ లో 142 మంది చనిపోయారన్నారు. మణిపూర్ ను చూసి బీజేపీ ప్రభుత్వాలకు శాంతి భద్రతలు నిర్వహించాలో తెలియడం లేదన్నారు.
ఈ వ్యాఖ్యలపై రాజస్థాన్ అసెంబ్లీలో విపక్ష నేత రాజేంద్ర రాథోర్ మండిపడ్డారు. రాజస్థాన్ నలుగురు సజీవ దహనమైన ఘటనతో ఇతర అంశాలను ఆయన ప్రస్తావించారు. ఇలాంటీ సీఎం నుండి ఇంతకంటే దిక్కుమాలిన ఆలోచనను ఆశించలేమన్నారు.
also read:అమానవీయ ఘటనలను ఎవరూ ఉపేక్షించరు: మణిపూర్ ఘటనపై మోడీ
రాజస్థాన్ జోథ్ పూర్ లో నలుగురు సజీవ దహనం సహా మహిళలపై అత్యాచారాల విషయంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి దర్శన జర్ధోష్ చెప్పారు. మరో రాష్ట్రంలో శాంతి భద్రతలను ప్రశ్నించడం పాకిస్తాన్ శాంతి సందేశం లాంటిందని ఆమె అభిప్రాయపడ్డారు. మణిపూర్ విషయానికొస్తే మోడీ పాలనలో అక్కడి పరిస్థితి మెరుగుపడిందన్నారు. ఇందుకు గణాంకాలే కారణమని చెప్పారు. ఎఎఫ్‌ఎస్‌పీఏ తొమ్మిది జిల్లాలకు పరిమితమైందని ఆమె గుర్తు చేశారు.
రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై దృష్టి పెట్టాలని గుజరాత్ సీఎం ఆశోక్ గెహ్లాట్ ను బీజేవైఎం మాజీ అధ్యక్షుడు జయరామ్ విప్లవ్ సూచించారు. శాంతి భద్రతలు అనేది రాష్ట్ర సమస్యగా ఆయన గుర్తు చేశారు. మణిపూర్ లో కూడ కఠిన చర్యలు తీసుకుంటున్నట్టుగా ఆయన చెప్పారు.
రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై ఎప్పుడు నోరు విప్పుతారని రింటి చటర్జీ పాండే ప్రశ్నించారు.