బీజేపీ తొలి జాబితా సిద్దం .. 38 మందికి ఛాన్స్.. అంబర్‌పేట, కరీంనగర్ టికెట్లు వీళ్లకే..!?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు బిజీబిజీగా మారాయి. ఈ తరుణంలో బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో 35 నుంచి 40 మంది అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే.. బీజేపీ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఈ పేర్లే దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ రాజకీయాలు వేడేక్కాయి. మరికొద్ది రోజుల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. బీజేపీ తమ ఎమ్మెల్యే అభ్యర్థులను మరో వారం లేదా పది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. గత రెండు మూడు రోజుల కిత్రం పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశమైంది.
ఈ సమావేశంలో పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాపై కసరత్తు చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 శాసన సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు వెయ్యిమందికి పైగా అభ్యర్థులు దరఖాస్తులను పరిశీలించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిటీ 38 మందితో మొదటి జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఆ జాబితాను ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి పంపారంట. ఈ జాబితాను బీజేపీ అధిష్టానం పరిశీలించిన తర్వాత స్వల్ప మార్పులతో 38 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం. మొత్తం మూడు జాబితాల్లో 119 మంది అభ్యర్థులను ప్రకటించనున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
తొలి జాబితా ఇదే..
- డాక్టర్ లక్ష్మణ్ (ముషీరాబాద్)
- కిషన్ రెడ్డి (అంబర్‌పేట)
- చింతల రాంచంద్రారెడ్డి (ఖైరతాబాద్)
- రాజాసింగ్ (గోషామహల్)
- ఎన్ రాంచందర్‌రావ్(మల్కాజిగిరి)
- ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ (ఉప్పల్)
- రఘు నందన్ రావు (దుబ్బాక)
- ఆచారి (కల్వకుర్తి)
- బండి సంజయ్ (కరీంనగర్)
- గుజ్జుల రామకృష్ణా రెడ్డి (పెద్దపల్లి)
- ఎగ్గెని నర్సింహులు (దేవరకద్ర)
- వెంకటాద్రి రెడ్డి (గద్వాల్)
- కీర్తి రెడ్డి (భూపాలపల్లి)
- డాక్టర్ విజయ్‌చందర్ రెడ్డి (పరకాల)
- వెంకటరమణారెడ్డి (కామారెడ్డి)
- లింగయ్యదొర కుమారుడు (పిన పాక)
- కుంజా సత్యవతి (భద్రాచలం)
- వినయ్ రెడ్డి (ఆర్మూర్)
- శ్రీధర్ రెడ్డి (పాలేరు)
- శ్రీవర్ధన్ రెడ్డి (షాద్‌నగర్)
- కొండయ్య (మక్తల్)
- మోహన్ రెడ్డి (మేడ్చల్)
- రేష్మ రాథోడ్ (వైరా)
- బాబుమోహన్ (ఆందోల్)
- పాయల్ శంకర్ (ఆదిలాబాద్)
- డాక్టర్ రమాదేవి (ముధోల్)
- ఆనంద్ రెడ్డి (నిజామాబాద్ రూరల్)
- రవిశంకర్ పటేల్ (తాండూరు)
- రతంగ్ పాండురెడ్డి (నారాయణ పేట)
- మల్లేశ్వర్ (అచ్చంపేట)