మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భార్య పద్మినిరెడ్డి బీజేపీ  సానుభూతిపరురాలని బీజేపీ శాసనసభపక్ష నేత జి. కిషన్ రెడ్డి చెప్పారు.  


హైదరాబాద్: మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భార్య పద్మినిరెడ్డి బీజేపీ సానుభూతిపరురాలని బీజేపీ శాసనసభపక్ష నేత జి. కిషన్ రెడ్డి చెప్పారు. పద్మినిరెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల తమ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు. 

శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీలో చేరాలనుకొని వచ్చిన పద్మిని రెడ్డిని స్వాగతించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కారణాలు ఏమిటో తెలియదు.... సాయంత్రానికే ఆమె బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారని కిషన్ రెడ్డి చెప్పారు.

ఏం ఇబ్బంది జరిగిందో తనకు తెలియదన్నారు. గురువారం ఉదయం పద్మిరెడ్డి బీజేపీలో చేరారు. సాయంత్రానికి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విషయమై మీడియా ప్రశ్నలకు ఆయన స్పందించారు. 

ప్రత్యేక తెలంగాణను వద్దని చెప్పిన మజ్లిస్‌ను టీఆర్ఎస్ భుజాన వేసుకొందన్నారు. టీఆర్ఎష్ కు ప్రజలు బుద్ది చెబుతారని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ద్రోహులకు కేసీఆర్ పెద్దపీట వేశారని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతంగా ఓటు వేసేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

పద్మినీరెడ్డి యూటర్న్:కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ప్రకటన

దామోదర భార్య బిజెపిలో చేరడం వెనక కథ ఇదే...

అందుకే దామోదర భార్య బీజేపీలోకి: హరీష్ సెటైర్లు

బీజేపీలో చేరే విషయం మా ఆయనకు చెప్పా: దామోదర భార్య పద్మిని రెడ్డి

ఝలక్: జగ్గారెడ్డిపై బీజేపీ అభ్యర్థిగా దామోదర భార్య?

కాంగ్రెస్‌కు భారీ షాక్: బీజేపీలో చేరిన దామోదర రాజనర్సింహ భార్య