దామోదర మేనిఫెస్టో ఆయన కుటుంబసభ్యులకే నచ్చలేదు... అందుకే ఆయన భార్య బీజేపీలో చేరారని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి  హరీష్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


మెదక్: దామోదర మేనిఫెస్టో ఆయన కుటుంబసభ్యులకే నచ్చలేదు... అందుకే ఆయన భార్య బీజేపీలో చేరారని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

గురువారం నాడు మెదక్ జిల్లా ఆంధోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ గుర్తించడం లేదని ఆయన విమర్శించారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మిర్యాలగూడ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను మూసివేస్తామని చెబుతున్నారు.ఇది కోమటిరెడ్డి ప్రకటనో.. కాంగ్రెస్ పార్టీ ప్రకటనో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జబర్థస్త్ గా నీళ్లను తీసుకెళ్తే పదవుల కోసం కాంగ్రెస్ నేతలు నోళ్లు మూసుకోలేదా అని ఆయన ప్రశ్నించారు. ఆంథోల్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న క్రాంతికిరణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కార్యకర్తలను కోరారు.

సంబంధిత వార్తలు

బీజేపీలో చేరే విషయం మా ఆయనకు చెప్పా: దామోదర భార్య పద్మిని రెడ్డి

ఝలక్: జగ్గారెడ్డిపై బీజేపీ అభ్యర్థిగా దామోదర భార్య?

కాంగ్రెస్‌కు భారీ షాక్: బీజేపీలో చేరిన దామోదర రాజనర్సింహ భార్య