మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని రెడ్డి గురువారం నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో  బీజేపీలో చేరారు.  


హైదరాబాద్: మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని రెడ్డి గురువారం నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మెన్ ‌గా ఉన్న దామోదర రాజనర్సింహ సతీమణి గురువారం నాడు బీజేపీలో చేరారు. ప్రధానమంత్రి మోడీ నాయకత్వంపై నమ్మకంతోనే పద్మినిరెడ్డి బీజేపీలో చేరారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

2009 ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దామోదర రాజనర్సింహ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. పద్మినిరెడ్డి రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు.

దామోదర రాజనర్సింహ సతీమణిగా పద్మిని రెడ్డి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండేవారు. అయితే దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని రెడ్డి కొంత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉందని ప్రచారం సాగుతోంది.

ఆంథోల్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కని మాజీ మంత్రి బాబు మోహన్ కూడ ఇటీవలనే బీజేపీలో చేరారు. అయితే దామోదర రాజననర్సింహ సతీమణి పద్మిని రెడ్డి బీజేపీలో చేరడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

పద్మిని రెడ్డి క్రియాశీలకంగా చురుకుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కోసం గతంలో తీవ్రంగా ప్రయత్నించింది. కానీ, చివరి వరకు ఆమె టిక్కెట్టు కోసం ప్రయత్నించినా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు దక్కలేదు.

కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలకు చెందిన అసంతృప్త నేతలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు బీజేపీ వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది. ఈ ఘటన బీజేపీకి రాజకీయంగా కలిసివచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఝలక్: జగ్గారెడ్డిపై బీజేపీ అభ్యర్థిగా దామోదర భార్య?

కాంగ్రెస్‌కు భారీ షాక్: బీజేపీలో చేరిన దామోదర రాజనర్సింహ భార్య

బీజేపీలో చేరే విషయం మా ఆయనకు చెప్పా: పద్మిని రెడ్డి