Asianet News TeluguAsianet News Telugu

Bike e-Challan : ఒక బైక్.. 179 చలాన్లు.. రూ.42,475 ఫైన్లు

హైదరాబాద్ అంబర్ పేట్ అలీ కేఫ్ చౌరస్తా‌లో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు ఓ షాకింగ్ ఘ‌ట‌న ఎదురైంది.   సోమవారం రాత్రి వాహనాలు తనిఖీలు చేస్తుండ‌గా.. హీరో హోండా ప్యాషన్ బైక్‌పై వచ్చిన వాహనదారుడు అక్క‌డే బైక్ వదిలి పారిపోయాడు. తీరా చెక్ చేస్తే..సదరు బైక్ పై 179 చలానాలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిపై విధించిన జరిమానా రూ.42,475 లు ఉంది. దీంతో పోలీసులు బైక్ సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు.
 

Bike Owner Ran Away Leaving His Bike Due To 179 Challans Worth 42k Penalty
Author
Hyderabad, First Published Dec 7, 2021, 12:48 PM IST

Bike e-Challan :  హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్  క‌ఠిన‌త‌రం చేస్తోన్నారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు. ద్విచ‌క్ర‌వాహ‌న దారులు హెల్మెట్ పెట్టుకోవాలని, రాంగ్ రూట్‌లో వెళ్ల‌కూడ‌ద‌నీ, సిగ్నల్ జంప్ చేయకూడ‌నీ ట్రాఫిక్ అధికారులు కోరుతున్నారు. త‌ద్వార ప్ర‌మాదాల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చున‌ని అవ‌గాహ‌న క‌ల్పిస్తోన్నారు. ఈ క్ర‌మంలో ట్రాఫిక్ రూల్స్ పాటించ‌ని వారిపై కొర‌డా ఝూళిపిస్తోన్నారు. అయినా కొంద‌రూ మాత్రం ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటించటం లేదు.  

దీంతో హైదరాబాద్ పోలీసు యంత్రాంగం అలర్ట్ అయ్యింది. సీసీ కెమెరాల ద్వారా, వాళ్ల వద్ద ఉన్న కెమెరాల  ద్వారా ట్రాఫిక్ నింబందనలు ఉల్లంఘించిన వారి ఫోటోలు తీసి వాటిపై  చలానాలు విధిస్తున్నారు.  తాజాగా న‌గ‌రంలో ఓ వ్య‌క్తి తన బైక్ పై పోలీసులు విధించిన చలానాలు కట్టలేక‌.. ఓ వాహాన దారుడు తన బైక్ వదిలి పరారయ్యాడు. తీరా అస‌లు విష‌యం.. తెలుసుకున్న పోలీసుల‌కే మైండ్ బ్లాంక్ అయ్యింది. 

Read Also: https://telugu.asianetnews.com/telangana/cyber-criminals-cheated-kamareddy-district-deputy-tahsildar-r3qfou

వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ అంబర్ పేట్ అలీ కేఫ్ చౌరస్తా‌లో సోమ‌వారం రాత్రి కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు ప్రధాన కూడళ్ళలో వాహనల‌ తనిఖీ లతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ వ్య‌క్తి త‌న హీరో హోండా ప్యాషన్ బైక్ (నెంబర్‌ AP 23 M 9895) పై వచ్చాడు. పోలీసులను చూసి చూడాగానే..  బైక్ వదిలి పారిపోయాడు. అస‌లేం జ‌రిగింద‌ని పోలీసులు ఆరా తీశారు. ఈ క్ర‌మంలో ఆ బైక్ మీద ఉన్న రికార్డులలో పరిశీలించిన పోలీసులు ఒక్క సారి షాక్‌కు గురయ్యారు. 

ఆ బైక్ పై ఒక‌టి కాదు రెండు కాదు.. ఏకంగా 179 చలానాలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిపై విధించిన జరిమానా రూ.  42,475/- రూపాయలు ఉండడంతో పోలీస్ లు ఆశ్చర్య పోయారు. పెద్ద మొత్తంలో జరిమానాలు ఉండటంతో నిందితుడు బైక్ వదిలి పారిపోయాడు. పోలీసులు బైక్ సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు.

Read Also: https://telugu.asianetnews.com/telangana/trs-mla-balka-suman-demands-on-etela-rajender-should-return-alleged-grabbing-lands-r3qd3r

గ‌తంలో కూడా ఇలాంటి ఘ‌ట‌న‌నే జ‌రిగింది. హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా వాహనాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఓ హోండా యాక్టివాను ఆపి పోలీసులు చెక్ చేయగా.. ప‌దుల సంఖ్య‌లో ట్రాఫిక్ రూల్స్ అతిక్ర‌మించిన‌ట్టు గుర్తించారు. తీరా చెక్ చేసి చూడ‌గా..  ఏకంగా 117 చలాన్లు ఉన్న‌ట్టు.. దాదాపు రూ.30 వేల పెండింగ్ అమౌంట్ ఉండటంతో వాహనాన్ని అబిడ్స్ పోలీసులు సీజ్ చేశారు.  
 
అలాగే.. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం డ్రంక్ అండ్ డ్రైవ్ కావడంతో పోలీసులు యాక్షన్ మొదలు పెట్టారు. ఇందులో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అయినా.. మందుబాబులు మార‌డం లేదు. సీటీలో ఎక్క‌డో ఓ చోట ప్ర‌మాదాల‌కు కార‌ణ‌మ‌వుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios