హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఓ వైద్య విద్యార్ధిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. వివరాల్లోకి వెళితే.. ఎల్బీ నగర్‌లోని సాగర్ రింగ్ రోడ్‌‌లోని అలేఖ్య టవర్స్‌లోని 14వ అంతస్తులో నివసిస్తున్న రఘురాం, పద్మల కుమార్తె సాహితి ఉస్మానియా డెంటల్ కాలేజీలో బీడీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది.

ఈ రోజు మధ్యాహ్నం సమయంలో తన నివాసంలోని బాల్కనీలో ఉన్న గ్రిల్స్ తొలగించి పై నుంచి దూకింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఎంబీబీఎస్ సీటు రాకపోవడం వల్ల చాలాకాలంగా మనస్తాపానికి గురైన సాహిత ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తండ్రి రఘురామ్ తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 

Also Read:

ప్రాణం తీసిన వన్‌సైడ్ లవ్: తన ప్రేమను కాదన్నాడని.. బాలిక ఆత్మహత్య, ప్రియుడి గదిలోనే..!!

ఆరుగురు డాక్టర్ల నిర్లక్ష్యంతోనే గద్వాల గర్భిణీ మృతి: హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక