హైదరాబాద్: గద్వాలకు చెందిన గర్భిణీ మృతి చెందిన ఘటనపై ఆరుగురు వైద్యులను బాధ్యులుగా చేస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆరుగురు వైద్యులపై చర్యలు తీసుకొంటామని ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు మంగళవారం నాడు తెలిపింది.

డెలీవరీ కోసం గద్వాలకు చెందిన గర్భిణీ 200 కి.మీ దూరం ప్రయాణించింది. చివరికి కరోనా లేదని సర్టిఫికెట్ తీసుకొస్తేనే డెలీవరీ చేస్తామని వైద్యులు చెప్పారు. చివరకు పేట్లబురుజు ఆసుపత్రిలో డెలీవరి చేశారు వైద్యులు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో తల్లీ బిడ్డలు ఏప్రిల్ 24వ తేదీన మరణించారు.

also read:గర్భిణీలను తరలించే ప్రైవేట్ వాహనాలకు పాస్‌లు అడగొద్దు: తెలంగాణ హైకోర్టు

ఈ విషయమై అయిజకు చెందిన న్యాయవాది కిషోర్ కుమార్ కు చెందిన లేఖ రాశాడు. ఈ లేఖను హైకోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై ఆరుగురు డాక్టర్లను బాధ్యులుగా చేస్తూ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక ఇచ్చింది.

మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు ప్రశాంతి, రాధా, సుల్తాన్ బజారు ఆసుపత్రిలో అమృత నిర్లక్ష్యాన్ని కూడ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. మరో వైపు గాంధీ ఆసుపత్రిలో వైద్యులు మహాలక్ష్మి, షర్మిల, అపూర్వలను కూడ ప్రభుత్వం ఈ విషయంలో బాధ్యులుగా ప్రకటించింది.ఈ నివేదికను ప్రభుత్వం ఇవాళ హైకోర్టుకు సమర్పించింది. 

రెడ్ జోన్ నుండి డెలీవరీ కోసం వచ్చిందని ఆమెకు వైద్యం చేసేందుకు డాక్టర్లు నిరాకరించారు. కరోనా లేదని సర్టిఫికెట్ తెస్తేనే డెలీవరీ చేస్తామని ప్రకటించారు. దీంతో ఈ సర్టిఫికెట్ తీసుకొచ్చిన తర్వాత పేట్ల బురుజు ఆసుపత్రిలో ఆమెకు డెలీవరి చేశారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో మగ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లీ బిడ్డలు ఇద్దరూ మరణించారు.