మహిళలను కించపర్చారు: రామ్ గోపాల్ వర్మపై మహిళా కమిషన్ కు బర్రెలక్క ఫిర్యాదు
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
నాగర్ కర్నూల్: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తెలంగాణ మహిళా కమిషన్ కు బర్రెలక్క ఫిర్యాదు చేశారు.
,ఊరు పేరు లేని బర్రెలక్క ఫేమస్ అయిందని రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై బర్రెలక్క ఫిర్యాదు చేసింది. బర్రెలక్క తరపున ఆమె న్యాయవాది కె. రాజేష్ కుమార్ తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
also read:రెండు దఫాలు గుర్తింపు సంఘం: నేడు తుడిచిపెట్టుకుపోయిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం
ఈ నెల 24వ తేదీన వ్యూహం సినిమా ఆడియో ఫంక్షన్ సమయంలో బర్రెలక్కపై రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై బర్రెలక్క మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఊరు పేరు లేని బర్రెలక్క ఫేమస్ అయింది.బర్రెలక్క బర్రెలు కాస్తది. బర్రెలు ఆమె మాట వింటాయి. అందుకే ఆమెను బర్రెలక్క అంటారని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై బర్రెలక్క తరపు న్యాయవాది మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు మహిళలను కించపర్చేలా ఉన్నాయని బర్రెలక్క వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలని బర్రెలక్క కోరారు.
also read:జగనన్న వదిలిన బాణం: కాంగ్రెస్ చేతికి అస్త్రం కానుందా?
ఈ ఏడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుండి బర్రెలక్క ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. కొల్లాపూర్ లో తనను గెలిపిస్తే ఏం చేస్తామో బర్రెలక్క ప్రజలకు హామీలు ఇస్తూ మేనిఫెస్టోను కూడ విడుదల చేసింది. కొల్లాపూర్ లో బర్రెలక్కకు సుమారు 5 వేల ఓట్లు దక్కాయి.