జగనన్న వదిలిన బాణం: కాంగ్రెస్ చేతికి అస్త్రం కానుందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతుంది. వై.ఎస్. షర్మిల అడుగులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయనే చర్చ సాగుతుంది.
జగనన్న వదిలిన బాణం: కాంగ్రెస్ చేతికి అస్త్రం కానుందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారనే ప్రచారం సాగుతుంది. 2024 జనవరి మాసంలో వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జగనన్న వదిలిన బాణం: కాంగ్రెస్ చేతికి అస్త్రం కానుందా?
2024 ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది.
జగనన్న వదిలిన బాణం: కాంగ్రెస్ చేతికి అస్త్రం కానుందా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో వై.ఎస్. షర్మిల పాదయాత్ర నిర్వహించారు.ఈ పాదయాత్ర సమయంలో రాజన్న బిడ్డను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రసంగించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి.
జగనన్న వదిలిన బాణం: కాంగ్రెస్ చేతికి అస్త్రం కానుందా?
2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి రాలేదు. కానీ, 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ అధికారాన్ని దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న తర్వాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి , వై.ఎస్.షర్మిల మధ్య అంతరం పెరిగిందనే ప్రచారం సాగుతుంది.ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇడుపులపాయకు వీరిద్దరూ వేర్వేరుగా వెళ్తున్నారు.
జగనన్న వదిలిన బాణం: కాంగ్రెస్ చేతికి అస్త్రం కానుందా?
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని యువజన శ్రామిక తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసింది వై.ఎస్. షర్మిల. అయితే వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ఆ పార్టీ భావిస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్‌టీపీ విలీన ప్రక్రియను చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమయ్యే అవకాశం లేకపోలేదు.
జగనన్న వదిలిన బాణం: కాంగ్రెస్ చేతికి అస్త్రం కానుందా?
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జీగా వై.ఎస్. షర్మిలకు ఇస్తారనే ప్రచారం సాగుతుంది. మరో వైపు వై.ఎస్. షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పదవిని అప్పగిస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు.
జగనన్న వదిలిన బాణం: కాంగ్రెస్ చేతికి అస్త్రం కానుందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా కాంగ్రెస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అయితే దీంతోనే 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి సోదిలోనే లేకుండా పోయింది. 2024 ఏప్రిల్ మాసంలో జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 10 శాతం ఓట్లు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది.
జగనన్న వదిలిన బాణం: కాంగ్రెస్ చేతికి అస్త్రం కానుందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.ఎస్. జగన్ కు వ్యతిరేకంగానే వై.ఎస్. షర్మిల రానున్న రోజుల్లో చక్రం తిప్పనుందనే ప్రచారం సాగుతుంది. గతంలో జగనన్న వదిలిన బాణం అంటూ షర్మిల ప్రచారం చేశారు. జగనన్నవదిలిన బాణం ఇప్పుడు అదే జగనన్న మీదికి రివర్స్ లోకి వెళ్తుందా అనే చర్చ ప్రారంభమైంది.
జగనన్న వదిలిన బాణం: కాంగ్రెస్ చేతికి అస్త్రం కానుందా?
వై.ఎస్. షర్మిల ఇప్పటికే చంద్రబాబు కుటుంబానికి క్రిస్‌మస్ గిఫ్ట్ పంపారు. దీనికి ప్రతిగా నారా లోకేష్ కూడ షర్మిలకు క్రిస్ మస్ గిఫ్ట్ పంపారు. ఈ పరిణామం కూడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు కారణమైంది.