రాజకీయాలంటే ఓ మురికి కూపంగా భావించే యువతకు ఆమే ఒక ఆదర్శం. అత్యంత చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించి...ఏకంగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇలా తెలంగాణ ఏర్పడిన తర్వాత అతిపిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడమే కాకుండా...ఇంగ్లీష్‌లో ప్రమాణస్వీకారం చేశారు. ఇలా రాజకీయాల్లోకి రావాలనుకునే ఉన్నత విద్యావంతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ హవా కొనసాగింది. అంతేకాకుండా ఆ పార్టీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే కోరం కనకయ్య బరిలోకి దిగారు. ప్రజాదరణ  ల్పోయిన కాంగ్రెస్్ పార్టీ తరపున ఇప్పుడిప్పుడే కాలేజి జీవితాన్ని ముగించిన మహిళ  హరిప్రియ పోటీకి దిగింది. ఇలా సీనియర్ నాయకున్ని, మంచి ఊపుమీదున్న పార్టీని రాజకీయాల్లో ఓనమాలు దిద్దే వయసులో హరిప్రియ ఓడించడం ఓ రికార్డగా నిలిచింది. 

ఇక నియోకవర్గ అభివృద్దిలో తన మార్కు చూపించుకోడానికి హరిప్రియ ప్రయత్నిస్తున్నారు. అందుకే అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఆమె అసెంబ్లీలో ఇంగ్లీష్ లో ప్రసంగించారు. ఇలా మొదటి సారి హేమాహేమీ నాయకుల మధ్య ఎలాంటి బెరుకు లేకుండా హరిప్రియ ప్రమాణ చేశారు.  

ఇక మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా ఇంగ్లీష లోనే ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణస్వీకారం తర్వాత మొత్తం  ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. వీరిలో ఇద్దరు ఇంగ్లీష్ లో నలుగురు తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. 

సంబందిత వార్తలు

తొలి రోజు అసెంబ్లీకి డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలు వీరే

అసెంబ్లీకి గైర్హాజరు, మాటకు కట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ నివాళి.. సండ్ర గైర్హాజరు

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ: ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కేసీఆర్