నిత్యం వివాదాల్లో చిక్కుకుంటూ, కాంట్రవర్సీకి కేరాఫ్‌గా చెప్పుకోనే గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాటకు కట్టుబడ్డారు. ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రొటెం స్పీకర్‌గా ఉన్న సభకు తాను రాబోనని ప్రకటించిన ఆయన అన్నమాట ప్రకారం సభకు గైర్హాజరయ్యారు.

ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారిగా తెలంగాణ శాసనసభ కొలువుదీరింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణం చేయించారు. మరోవైపు సభకు గైర్హాజరవ్వడంపై న్యాయపరంగా సమస్యలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్దమన్న రాజాసింగ్.. తాను దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ నుంచి గెలిచిన వ్యక్తినన్నారు.