రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఇవాళ రెండవసారి కొలువుదీరింది. ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్ అహ్మద్ ఖాన్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారు కొందరైతే, పాతవారు మరికొందరు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికన్నా ముందుగా ప్రమాణం చేయగా.. ఆ తర్వాత మిగిలిన వారు చేశారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు అసలు ఈ రోజు సభకే హాజరుకాలేదు. మొత్తం సభ్యుల సంఖ్య 119 కాగా, ఇవాళ 114 మంది ప్రమాణం చేశారు.

అక్బరుద్దీన్ ఒవైసీ, జాఫర్ హుస్సేన్, మాధవరం కృష్ణారావు, రాజాసింగ్, సండ్ర వెంకట వీరయ్యలు సభకు హాజరుకాలేదు. వీరిలో ఎంఐఎం సభ్యుడు స్పీకర్ స్థానంలో ఉంటే.. తాను ప్రమాణం చేయనని ఇంతకు ముందు చెప్పిన రాజాసింగ్... అన్నట్లుగానే మాట నిలబెట్టుకోగా... మిగిలిన వారు వ్యక్తిగత కారణాల వల్ల సభకు గైర్హాజరైనట్లు తెలిపారు.

అసెంబ్లీకి గైర్హాజరు, మాటకు కట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ నివాళి.. సండ్ర గైర్హాజరు