Asianet News TeluguAsianet News Telugu

బంజారాహిల్స్ భూ వివాదం: ఐదు గంటలకు పైగా షేక్‌పేట ఎమ్మార్వోను విచారించిన ఏసీబీ

ఐదు గంటలకు పైగా షేక్‌పేట తహసీల్దార్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు బంజారాహిల్స్ లోని 1.20 ఎకరాల భూ వివాదంలో షేక్‌పేట ఆర్ఐ నాగార్జునరెడ్డి, బంజారాహిల్స్ ఎస్ఐ రవీందర్‌లను ఏసీబీ శనివారం నాడు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

banjara hills land issue: acb officers investigates shaikpet mro sujatha
Author
Hyderabad, First Published Jun 7, 2020, 4:24 PM IST

హైదరాబాద్: ఐదు గంటలకు పైగా షేక్‌పేట తహసీల్దార్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు బంజారాహిల్స్ లోని 1.20 ఎకరాల భూ వివాదంలో షేక్‌పేట ఆర్ఐ నాగార్జునరెడ్డి, బంజారాహిల్స్ ఎస్ఐ రవీందర్‌లను ఏసీబీ శనివారం నాడు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

శనివారం నాడు అర్ధరాత్రి వరకు షేక్‌పేట తహసీల్దార్ సుజాత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.

also read:భూ వివాదంలో లంచం: బంజారాహిల్స్ ఎస్ఐ రవీందర్, షేక్‌పేట ఆర్ఐ అరెస్ట్

షేక్‌పేట తహసీల్దార్ సుజాత ఇంట్లో శనివారం నాడు రాత్రే రూ. 30 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు. మూడు సంచుల్లో రూ. 30 లక్షలను సీజ్ చేసుకొన్నారు.
మరోవైపు ఏసీబీకి చిక్కిన ఆర్ఐ నాగార్జున రెడ్డి, ఎస్ఐ రవీందర్ నాయక్‌లను శనివారం నాడు ఏసీబీ అరెస్ట్ చేసింది.

also read:రూ. 15 లక్షలు తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన షేక్‌పేట ఆర్ఐ

ఆదివారం నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు షేక్‌పేట ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అధికారులు విచారించారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో ఆమెను విచారించారు.

తన ఇంట్లో దొరికిన డబ్బులకు సంబంధించి ఏసీబీ అధికారులకు సుజాత పొంతనలేని సమాధానాలు చెప్పారని సమాచారం.ఈ డబ్బంతా తన సంపాదనే అంటూ సుజాత ఏసీబీ అధికారులకు చెప్పారని తెలుస్తోంది. 

రంగారెడ్డి జిల్లాలోని రెవిన్యూ అధికారులపై ఏసీబీ అధికారులు నిఘా ఏర్పాటు చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios