Asianet News TeluguAsianet News Telugu

రూ. 15 లక్షలు తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన షేక్‌పేట ఆర్ఐ

రూ. 15 లక్షలు లంచం తీసుకొంటూ షేక్‌పేట రెవిన్యూ ఇన్స్‌పెక్టర్ నాగార్జున ఏసీబీ అధికారులకు శనివారం నాడు  ఏసీబీ అధికారులకు చిక్కాడు.స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు స్థల యజమాని నుండి ఆయన నుండి రూ. 50 లక్షలు డిమాండ్ చేసినట్టు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది.

acb officials trapped shaikpet revenue inspector nagarjuna
Author
Hyderabad, First Published Jun 6, 2020, 5:50 PM IST


హైదరాబాద్: రూ. 15 లక్షలు లంచం తీసుకొంటూ షేక్‌పేట రెవిన్యూ ఇన్స్‌పెక్టర్ నాగార్జున ఏసీబీ అధికారులకు శనివారం నాడు  ఏసీబీ అధికారులకు చిక్కాడు.స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు స్థల యజమాని నుండి ఆయన నుండి రూ. 50 లక్షలు డిమాండ్ చేసినట్టు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది.

రూ. 50 లక్షల్లో తొలి విడతగా రూ. 15 లక్షలను లంచం తీసుకొంటూ పట్టుబడ్డాడు. బంజారాహిల్స్‌లో సయ్యద్ అబ్దుల్‌కు చెందిన స్థలాన్ని ప్రభుత్వం రెవెన్యూ స్థలంగా పేర్కొంది. 

స్థలం తమదేనంటూ సయ్యద్ అబ్దుల్ కోర్టుకెక్కారు. ఈ స్థలం సయ్యద్ అబ్దుల్‌దేనంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ బోర్డు తీసి సయ్యద్ అబ్దుల్ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

దీంతో రెవెన్యూ శాఖ ఫిర్యాదు మేరకు సయ్యద్ అబ్దుల్‌పై కేసు నమోదైంది. స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు ఆర్‌ఐ నాగార్జున, బంజారాహిల్స్‌ ఎస్సై రవీందర్‌ 50 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. 

ఇదే స్థల వివాదంలో ఆర్‌ఐ నాగార్జునతో పాటుగా బంజారాహిల్స్ ఎస్సై రవీందర్‌ కూడా డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఎస్సై రవీందర్‌ను కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 

బంజారాహిల్స్‌లోని ఒకటిన్నర ఎకరాల స్థల వివాదంలో వీరిద్దరూ లంచాలు డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. ఎస్సై రవీందర్‌పై ఆరోపణల నేపథ్యంలో బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.షేక్‌పేట ఎమ్మార్వో సుజాత ఇంట్లో రూ. 30 లక్షలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios