Asianet News TeluguAsianet News Telugu

అన్న అదేశిస్తే రాజకీయాల్లోకి బండ్ల గణేష్ రీఎంట్రీ

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని బండ్ల గణేష్ మల్లు రవితో చెప్పారు.

Bandla Ganesh may give reentry into politics
Author
Shadnagar, First Published Oct 15, 2021, 8:50 AM IST

హైదరాబాద్: ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీలో చురుగ్గా వ్యవహరించాలని మాజీ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి Bandla Ganeshను కోరారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ముందుకు అడుగులు వేస్తానని బండ్ల గణేష్ మల్లు రివతో చెప్పారు. 

షాద్ నగర్ ప్రాంతంలో గల షరూఖ్ నగర్ మండలం పరిధిలోని బుచ్చిగూడ గ్రామ మాజీ సర్పంచ్ తాండ్ర సులోచనమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆమె చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

ఆ సమయంలోనే Reavanth Reddy, మల్లు రవి, బండ్ల గణేష్ మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి కీలకమైన పదవిలో ఉన్నారని, అందువల్ల పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలని మల్లు రవి బండ్ల గణేష్ తో అన్నారు. దాంతో అన్న రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ముందుకు వస్తానని బండ్ల గణేష్ చెప్పారు.

బండ్ల గణేష్ గతంలో కాంగ్రెసు పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెసుకు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. కాంగ్రెసు ఓటమీ పాలు కావడంతో ఆయన వెనక్కి తగ్గారు. బండ్ల గణేష్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితుడు. Pawan Kalyanaను ఆయన తన దైవంగా భావిస్తారు. అయినప్పటికీ ఆయన అప్పట్లో కాంగ్రెసులో చేరారు.  

ఇదిలావుంటే, సినీ పరిశ్రమ పట్ల ఆసక్తి ఉన్న యువతకు సినిమాల్లో అవకాశం కల్పిస్తామని బండ్ల గణేష్ చెప్పారు. షాద్ నగర్ పట్టణం నుంచి తక్కువలో తక్కువ 500 మందికి సినీ పరిశ్రమలో అవకాశాలు కల్పించాలన్నదే తన లక్ష్యమని ఆయన చెప్పారు. 

జర్నలిస్టు ఖాజా పాషా నటించిన గోలీమార్ పాటను బండ్ల గణేష్ గురువారంనాడు ఆవిష్కరించారు. ఆయన తర్వాత ఆయన మాట్లాడారు. చిరంజీవి సినిమాలను ఆదర్శంగా తీసుకుని తాను సినీ పరిశ్రమలోకి ప్రవేశించానని, ఎంతో పట్టుదలతో తన కలను నెరవేర్చుకున్నానని ఆయన చెప్పారు. 

ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోయేషన్ (మా) ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి పదవికి నామినేషన్ దాఖలు చేసి ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరఫున జీవిత రాజశేఖర్ కు ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. జీవితా రాజశేఖర్ మీద తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే, మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ తో పాటు జీవిత రాజశేఖర్ కూడా ఓటమి పాలయ్యారు. మంచు విష్ణు ప్యానెల్ నుంచి ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన రఘుబాబును గెలిపించాలని కూడా బండ్ల గణేష్ పిలుపునిచ్చారు. 

Also Read: 
జనసేన స్ట్రాంగ్ గా లేదు, పరిస్థితి బాగోలేని పార్టీని భుజాన మోయలేం... బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
జిహెచ్ఎంసీ ఎన్నికలు: కల్వకుంట్ల కవితకు బండ్ల గణేష్ కౌంటర్

Follow Us:
Download App:
  • android
  • ios