హైదరాబాద్: టీఆరెఅస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. ట్విటర్ వేదికగా బండ్ల గణేష్ కవితకు సమాధానం ఇచ్చారు. 

"కవిత గారూ.... నేను జోకర్ని కాదు. ఫైటర్ని" అని ఆయన అన్నారు. "నేను ప్రస్తుతం రాజకీయాల్లో తలదూర్చాలని అనుకోవడం లేదు, మీకు ఆల్ ది బెస్ట్" అని బండ్ల గణేష్ అన్నారు. 

జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుంట్ల కవిత ముషీరాబాద్ శాసనసభ నయోజకవర్గం గాంధీనగర్ డివిజన్ లో పాదయాత్ర చేశఆరు. ఈ పాదయాత్రలో బండ్ల గణేష్ మీద ఆమె వ్యాఖ్య చేశారు. 

గత ఎన్నికలకు ముందు బండ్ల గణేష్ అనే ప్రజలందరినీ కడుపుబ్బా నవ్విస్తే ప్రస్తుత ఎన్నికల్లో బండ్ల గణేష్ ని మించి బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అనే వ్యక్తి కామెడీ చేస్తున్నారని ఆమె అన్నారు. 

రోజుకో వేషం వేసి కమెడియన్ గా మాట్లాడుతూ నగర ప్రజలను బండి సంజయ్ కామెడీతో నవ్విస్తున్నారని ఆమె అన్నారు. కవిత చేసిన వ్యాఖ్యలకు బండ్ల గణేష్ ప్రతిస్పందించారు.