ఈ రోజు బండి సంజయ్ ముంబై వెడుతున్నారు. అక్కడ ముంబాదేవిని దర్శించుకున్న అనంతరం అక్కడినుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. 

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. బండి సంజయ్ రాష్ట్ర బాధ్యతల విషయంలో రోజులో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ సోమవారం ముంబె వెడుతున్నారు. అక్కడ ముంబాదేవిని దర్శించుకున్న అనంతరం అక్కడినుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. 

అధ్యక్ష పదవి రెండు మూడు రోజుల ముచ్చటే అంటూ సన్నిహితుల దగ్గర బండి సంజయ్ నిరాశ వెల్లడించారని సమారాచం. వరంగల్ మోడీ మీటింగుకు అధ్యక్ష హోదాలో హాజరవుతానో లేదో అని వారితో అనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాత్రం బండి సంజయే పార్టీ అధ్యక్షుడిగా ఉంటారని చెబుతున్నారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో వస్తానో.. లేదో తెలియదు - కార్యకర్తలతో బండి సంజయ్ కుమార్

మరోవైపు సోషల్ మీడియాలో సంజయ్ అనుకూల వ్యతిరేక పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లో కీలక భేటీ జరగనుంది. ఈ మీటింగ్ కు ఈటెల రాజేందర్, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ రానున్నారు. ఇటీవల బీజేపీ నేత జితేందర్ రెడ్డి స్వపక్షంపై చేసిన ట్వీట్ బిజెపిలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మీటింగ్ జరగనుండడంతో ఈ మీటింగ్ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఇక బీజేపీ అసంతృప్త నేతలు ఎమ్మెల్యే రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు.