Asianet News TeluguAsianet News Telugu

సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ.. ఎందుకంటే ?

సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 

Bandi Sanjay's open letter to CM Revanth Reddy.. for Sircilla handloom weavers..ISR
Author
First Published Jan 17, 2024, 5:39 PM IST

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. అందులో సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు. సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రంగంపై ఆధారపడ్డ 20 వేల మంది కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజల బలమైన గొంతుక బీఆర్‌ఎస్ మాత్రమే - కేటీఆర్

‘‘ ఈ ప్రాంతంలో మొత్తం 33 వేల మరమగ్గాలుండగా, ఇందులో 28 వేల మగ్గాలపై పాలిస్టర్ వస్త్రాలు, 5 వేల మగ్గాలపై కాటన్ వస్త్రాలు తయారవుతున్నాయి. ఉత్పత్తి వ్యయం పెరగడం, పాలిస్టర్ బట్టకు గిట్టుబాటు ధర, సరైన మార్కెట్ లేకపోవడంతో సిరిసిల్లలో సాంచాలను బంద్ పెట్టారు. దీనికి ప్రధాన కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే.’’ అని బండి సంజయ్ ఆరోపించారు. 

‘‘గత ఏడేళ్లుగా ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధార పడి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మనుగడ సాగిస్తోంది. వస్తోత్పత్తిదారులు సొంతంగా వస్త్ర వ్యాపారం చేయడం లేదు. ప్రధానంగా బతుకమ్మ చీరలకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు రూ.220 కోట్లను బకాయి పెట్టింది. ఈ బకాయిలు రాకపోవడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ బకాయిలను చెల్లిస్తామని అప్పటి మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ పలు మార్లు హామీ ఇచ్చినా చెల్లించలేదు. చివరకు ఎన్నికల కోడ్ ను సాకుగా చూపి బకాయిలు చెల్లించలేదు.’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.

ఈ చైనా ఊరికే ఉండదుగా.. మరో ప్రాణాంతక వైరస్ పై ప్రయోగాలు.. 100 శాతం మరణాల రేటట..

‘‘కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మీరు ఈ మొత్తం బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతున్నాను. అట్లాగే ప్రభుత్వ ఆర్డర్లతో సిరిసిల్ల కార్మికులు ఉపాధి పొందుతున్న నేపథ్యంలో మీరు ప్రత్యేక చొరవ తీసుకొని భారీగా ప్రభుత్వ ఆర్డర్లను ఇచ్చి సిరిసిల్ల కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నాను’’ అని తెలిపారు.

‘‘ సిరిసిల్లలో నేత కార్మికులను ఓనర్లుగా మార్చేందుకు 2017 అక్టోబర్ 11న అప్పటి సీఎం కేసీఆర్ “వర్కర్ టు ఓనర్” పథకం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తొలి విడతలో ఈ కార్యక్రమానికి రూ.220 కోట్లను కేటాయిస్తున్నామని, 1104 మంది కార్మికులను మొదటి దశలో ఓనర్లుగా మారుస్తామని ప్రకటించారు. కానీ ఇంతవరకు ఇవి అమలు కాలేదు. మీరు కార్మికుల సంక్షేమం కోసం తక్షణమే ఆ నిధులు కేటాయించి నేత వర్కర్లను ఓనర్లుగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కోరుతున్నాను.’’ అని పేర్కొన్నారు.

మా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించారు.. ఇక తీవ్ర పరిణామాలుంటాయ్ - ఇరాన్ కు పాక్ వార్నింగ్..

సిరిసిల్లలో మరమగ్గాలను ఆధునీకరించాల్సిన అవసరం ఎంత్కెనా ఉందని బండి సంజయ్ సూచించారు. మరమగ్గాల ఆధునీకరణకు అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. అట్లాగే సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారని, అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలు పంపించాలని కోరారు. దానిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా మంజూరు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios