హైద్రాబాద్ కు చేరుకున్నబండి సంజయ్: ఘనంగా స్వాగతం పలికిన కార్యకర్తలు

బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్  న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ కు  చేరుకున్నారు.  శంషాబాద్ ఎయిర్ పోర్టులో  బండి సంజయ్ కు  ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. 

Bandi Sanjay Reaches  To  Hyderabad From New Delhi lns

హైదరాబాద్:  న్యూఢిల్లీ నుండి  హైద్రాబాద్ కు  బండి సంజయ్  చేరుకున్నారు. నాలుగు   రోజుల క్రితం బండి సంజయ్  న్యూఢిల్లీ వెళ్లారు.  న్యూఢిల్లీకి వెళ్లే సమయంలో ఆయన  బీజేపీ అధ్యక్షుడిగా  ఉన్నారు.  రెండు రోజుల క్రితం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి  బండి సంజయ్  రాజీనామా చేశారు. 

బండి సంజయ్ ను  పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పించాలని  ఆ పార్టీ నేతలు కొందరు  బీజేపీ అగ్ర నాయకత్వాన్ని  కోరారు.  ఇదే విషయమై  ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  అమిత్ షా సహా  బీజేపీ అగ్రనేతలకు ఫిర్యాదు  చేశారు. 

ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీకి  ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో  రాష్ట్రంలో అధికారంలోకి రావాలని  బీజేపీ  వ్యూహాంతో ముందుకు వెళ్తుంది. ఎన్నికల్లో  విజయం సాధించాలంటే  పార్టీని బలోపేతం  చేయాల్సిన అవసరం ఉందని  ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే పార్టీలో సంస్థాగత మార్పులకు  ఆ పార్టీ శ్రీకారం చుట్టింది.  

న్యూఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు  జేపీ నడ్డా తో  బండి సంజయ్ సమావేశమయ్యారు.  పార్టీలో  మార్పులు  చేర్పులు చేయాల్సిన పరిస్థితుల గురించి  జేపీ నడ్డా బండి సంజయ్ కు  వివరించారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పుకోవాలని సూచించారు.  రానున్న రోజుల్లో మోడీ కేబినెట్ లోకి  బండి సంజయ్ ను తీసుకొంటామని  కూడ నడ్డా హామీ ఇచ్చారని సమాచారం.

also read:హైదరాబాద్ చేరుకున్న కిషన్ రెడ్డి.. ఈటల స్వాగతం, ఢిల్లీలోనే ఆగిపోయిన బండి సంజయ్

అయితే  కేంద్ర మంత్రి వర్గంలో  చేరేందుకు బండి సంజయ్ ఆసక్తిని చూపడం లేదని సమాచారం.  జేపీ నడ్డా ఆదేశాల మేరకు  బండి సంజయ్  బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా  చేశారు.   బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా  చేసిన తర్వాత బండి సంజయ్  ఇవాళ  సాయంత్రం  హైద్రాబాద్ కు  చేరుకున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి  బండి సంజయ్  మీడియా సమావేశంలో పాల్గొంటారు.బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన  కిషన్ రెడ్డి  త్వరలోనే  కేంద్ర మంత్రి పదవికి  రాజీనామా చేయనున్నారు.  ఈ నెలలోనే కేంద్ర మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ  ఉండనుంది

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios