నకిలీ అధికారుల డ్రగ్ కేసు బెదిరింపులు.. భయంతో యువ నటి ఆత్మహత్య
ముంబయి నగరంలో నకిలీ అధికారుల వేధింపులకు ఓ యువనటి బలవంతంగా తన ప్రాణాలు తీసుకుంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులుగా నటిస్తూ వేధింపులకు గురిచేసి.. యువనటి ప్రాణాలు పోవడానికి కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. నకిలీ అధికారులు వేధింపులు తట్టుకోలేక ఓ యువనటి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. Narcotics Control Bureau (NCB) అధికారులమంటూ కొన్ని రోజులుగా ఇద్దరు వ్యక్తులు ఆ యువ నటిని బెదిరింపులకు గురిచేస్తున్నారు. 40 లక్షల రూపాయలను డిమాండ్ చేయడంతో తీవ్ర భాయాందోళనకు గురైన సదరు నటి ఆత్మహత్య చేసుకుంది. ముంబయిలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ నటి ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. ముంబయికి చెందిన 28 సంవత్సరాల ఓ యువ నటి డిసెంబరు 20న ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో పార్టీకి వెళ్లింది. అయితే, హుక్కా పార్లర్‌లో ఉన్నప్పుడు అక్కడకు చేరుకున్న ఇద్దరు వ్యక్తులు తాము Narcotics Control Bureau (NCB) అధికారులమంటూ.. వాళ్లను బెదిరించారు.
Also Read: Taliban: 72 కిలో మీటర్లు మహిళలు వెళ్తే.. తాలిబన్ల మరో హుకుం !
అలాగే, డ్రగ్స్ కేసులో పేరు వెల్లడించకుండా ఉండాలంటే 40 లక్షలు రూపాయలు ఇవ్వాలని ఆమెను డిమాండ్ చేశారు. ఆ రోజు నుంచి నిత్యం ఆ యువనటిని ఈ నకిలీ అధికారులు డబ్బుల కోసం పదేపదే ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. తీవ్ర భయాందోళన, మనస్థాపానికి గురైన సదరు నటి బలవంతంగా తన ప్రాణాలు తీసుకుంది. తను నివాసం ఉంటున్న గదిలోనే ఫ్యానుకు ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునీ, ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్నారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్‌సీబీ అధికారుల మంటు ఇద్దరు వ్యక్తులు బెదిరించడంతోనే ఆ నటి ప్రాణాలు తీసుకుందనీ, ఈ ఘటనతో ఆమె వెంట ఉన్న స్నేహితులకు కూడా సంబంధం ఉండివుండచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నిందితులైన సూరజ్ మోహన్ పరదేశి(38), పర్వీన్ రఘునాథ్ వాలింబే(35)ను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే, ఆ యువనటి స్నేహితులను కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు.
Also Read: Delmicron: ఒకవైపు ఒమిక్రాన్... మరోవైపు డెల్మిక్రాన్ ! .. అమెరికాలో టెన్షన్ టెన్షన్.. !
ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ "ఎన్‌సీబీ అధికారులుగా ఇద్దరు వ్యక్తులు మాదకద్రవ్యాల కేసులో ఇరికిస్తామని యువ నటిని బెదిరించడంతో ఆమె ప్రాణాలు తీసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు సూరజ్ పరదేశి, ప్రవీణ్ వాలింబేలను అరెస్టు చేసాము. నిందితులు మొదట రూ. 40 లక్షలు డిమాండ్ చేశారు, దానిని 20 లక్షలు తగ్గించారు" అని తెలిపారు. జోన్ 9 DCP మంజునాథ్ సింగ్ మాట్లాడుతూ, "మేము ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసాము. సెక్షన్ 306, 170, 420, 384, 388, 389, 506 మరియు 120B కింద కేసు నమోదు చేయబడింది. మరిన్ని అరెస్టులు కొనసాగే అవకాశముంది. దీనిపై ప్రస్తుతం తదుపరి విచారణ కొనసాగుతోంది అని వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్ మాలిక్ Narcotics Control Bureauపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్సీబీనే తమ ప్రయివేటు ఆర్మీతో డబ్బుల కోసం మహిళను వేధించిందని ఆరోపించారు. బాలీవుడ్ నటీమణుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఎన్సీబీనే ఓ ప్రయివేటు ఆర్మీని ఏర్పాటు చేసింది. నకిలీ కేసుల పేరుతో వారిని బెదిరించి, డబ్బులను వసూలు చేస్తోంది. దీనిపై విచారణ చేయాలి అని అన్నారు.
Also Read: Coronavirus: బ్రిటన్ లో కరోనా టెర్రర్.. ఒక్కరోజే 1,22,186 కొత్త కేసులు.. లండన్‌లో ఏకంగా..