తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పంచ్ డైలాగులతో మంట పుట్టిస్తున్నారు. ఇవాళ శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్ ప్రసాద్ తరపున ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ... ఎన్నో బలిదానాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో అమరవీరులకు అన్యాయం జరిగిందని..రైతన్నలు అనేక ఇబ్బందులకు గురయ్యారని ఆరోపించారు.

హైదరాబాద్‌పై చంద్రబాబు ముద్రను తీసేయ్యలేరని ఆయన ప్రతిష్టను ఎవరూ మసకబార్చలేరని ఎద్దేవా చేశారు. బాబును వద్దనుకుంటే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, రింగ్‌రోడ్లు, ఫ్లైఓవర్లు, సైబరాబాద్ కూడా తీసేయాలని బాలకృష్ణ అన్నారు. ఆయన కట్టించిన స్థలాల్లో మీటింగులు పెట్టుకుని... బాబునే కొందరు విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

మహిష్మతి సామ్రాజ్యానికి భల్లాలదేవుడు ప్రభువైనా... ప్రజల గుండెల్లో కొలువైన మహారాజు బాహుబలేనని బాలయ్య వ్యాఖ్యానించారు. ఇప్పుడు అధికారాన్ని అనుభవిస్తున్న వారిది లాటరీ అని.. చంద్రబాబుది హిస్టరీ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక కులానికో, మతానికో పుట్టిన బిడ్డ కాదని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సంక్షేమమే టీడీపీ అజెండా అని బాలకృష్ణ స్పష్టం చేశారు. 

మూడ్ వస్తే ఫాంహౌస్ లో పడుకోవడం కాదు రాజకీయాలంటే :బాలకృష్ణ

బాలకృష్ణపై కె.ఎ పాల్ సెటైర్స్...,షాకైన యాంకర్