అంతర్జాతీయ స్థాయిలో అమెరికా అధ్యక్షులతో భేటీలు, ప్రపంచ శాంతి అంటూ మాటలు చెప్పి, కొన్నేళ్ల క్రితం రాజకీయపార్టీ సైతం స్థాపించి తర్వాత చిరునామా గల్లంతైన కెఎ పాల్‌ అలియాస్ కిలారి ఆనందపాల్‌ ఇప్పుడో కామెడీ పీస్ గా మారిపోయారు. టీవి ఛానెల్స్ వాళ్లు పనిగట్టుకుని ఆయన్ను పిలిచి వాగించి, కామెడీ చేయిస్తున్నారు.

తమ స్లాట్ ఖాళీ ఉన్నప్పుడు కెఎ పాల్ ని పిలుస్తూంటే..ఆయన కూడా ఉత్సాహంగా ఎప్పుడూ లేనివిధంగా తెలుగు సినీ ప్రముఖులమీదా, ఎపి తెలంగాణ రాజకీయ నేతలమీదా తన దైన శైలిలో కౌంటర్స్,కామెట్స్ పాస్ చేసేస్తున్నారు.   హిల్లరీపై ట్రంప్ చారిత్రక గెలుపును సాధించినా అంత తన చలవేనంటూ చెప్పే పాల్.  పవన్ కళ్యాణ్, రామ్ గోపాల్ వర్మ, నారా లోకేష్, కెటిఆర్, జలీల్ ఖాన్ ఫిజిక్స్ ఇలా అందరిపైనా తమ కామెంట్స్ పాస్ చేస్తూంటారు కెఎ పాల్. తాజాగా  ఓ టీవి ఛానెల్ తో లైవ్ డిబేట్ లో పాల్గొన్న ఆయన బాలయ్యపై తన దృష్టి ని పెట్టారు. 

మహాకూటమి తరపున కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ విషయం ప్రస్తావిస్తూ ఆమెకు మాట్లాడటం రాదని దెప్పి పొడిచారు. అప్పుడు యాంకర్ అందుకుని...సుహాసిని మరెవరో కాదని నందమూరి హరకృష్ణ కుమార్తె అని గుర్తు చేసారు. హరికృష్ణ  ఎవరో తనకు తెలియదన్నారు. నందమూరి బాలకృష్ణ తెలుసా అంటే విన్నాను ..యాక్టర్ కదా అన్నారు. బాలకృష్ణ ఎమ్మల్యే, మంచి హీరో అని ఆమె అన్నారు.