ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనిివాస్ రెడ్డి కొడుకు వివాహ రిసెప్షన్ సందర్భంగా బాహుబలి సెట్టింగ్స్ ఏర్పాటు చేశారు.
ఖమ్మం: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్షారెడ్డి పెళ్లి విందు రిసెప్షన్ ను పురస్కరించుకొని భారీగా ఏర్పాట్లు చేశారు. ఆదివారం నాడు ఖమ్మం పట్టణంలోని ఎస్ఆర్ గార్డెన్స్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ గార్డెన్ వద్ద ఖాళీ స్థలం వద్ద బాహుబలి తరహలో భారీ సెట్టింగ్ ఏర్పాటు చేశారు.
గత నెల 26వ తేదీన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్షారెడ్డి వివాహం హైద్రాబాద్‌లో జరిగింది. అయితే హర్షారెడ్డి వివాహన్ని పురస్కరించుకొని ఆదివారం నాడు ఖమ్మంలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
also read:గద్వాలలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ: మరో ప్రియుడితో కార్తీక్ హత్య, ప్రియురాలు సూసైడ్
రిసెప్షన్ వేదికకు వెళ్లేందుకు రఘునాథపాలెం రోడ్డులో ప్రత్యేక స్వాగత ద్వారాన్ని ఏర్పాటు చేశారు. వంద ఎకరాల స్థలంలో ఎవరికి ఇబ్బందులు కలగకుండా షామియానాలు ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాల నుండి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు రిసెప్షన్ కు హాజరయ్యే అవకాశం ఉంది.
లక్ష మందికి ఒకేసారి విందులో భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఎనిమిది ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. ఎనిమిది విభాగాల్లో లక్ష మంది ఒకేసారి విందులో పాల్గొనేలా ఏర్పాటు చేశారు. భోజనం కోసం వచ్చేవారికి భోజనం చేసి తిరిగి వెళ్లేవారికి వేర్వేరు ద్వారాలు ఏర్పాటు చేశారు. మినరల్ వాటర్ తో పాటు, ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారు.
