మునుగోడులో రాజకీయాలు వెంట వెంటనే మారిపోతున్నాయి. నిన్న ఒక పార్టీలో ఉన్న నాయకుడు నేడు మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరిన చుండూరుకు చెందిన ఓనాయకుడు తిరిగి నేడు సొంత గూటికి చేరుకున్నారు. 

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి ఎదురుదెబ్బ త‌గిలింది. ఇటీవ‌ల టీఆర్ఎస్ ను కాద‌ని చుండూరు మండ‌లం దోనిపాముల స‌ర్పంచ్ తిప్ప‌ర్తి దేవేంద‌ర్ బీజేపీలో చేరారు. కానీ మంగ‌ళ‌వారం ఉద‌యం ఆయ‌న సొంత గూటికి చేరారు. హైద‌రాబాద్ లో మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి త‌న నివాసంలో దేవేంద‌ర్ ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ మండ‌ల నాయ‌కుల స‌మ‌క్షంలో ఆయ‌న‌కు గులాబీ కండువ క‌ప్పి తిరిగి సొంత పార్టీలోకి తీసుకొచ్చారు.

ప్రేమ‌కు వయోపరిమితి లేదు.. లాలూకు శిక్ష విధించిన 64 ఏళ్ల జ‌డ్జి ప్రేమ వివాహం

ఉప ఎన్నిక జ‌ర‌గ‌బోయే మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్, బీజేపీ ల నుంచి టీఆర్ఎస్ కు చేరిక‌లు జోరుగా సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో దోనిపాముల స‌ర్పంచ్ తిరిగి టీఆర్ఎస్ లోకి చేర‌డం బీజేపీకి మింగుడు ప‌డటం లేదు. ఈ ప‌రిణామాలు కాషాయ ద‌ళాన్ని క‌ల‌వ‌రానికి గురి చేశాయి. కాగా ఇప్పుడు టీఆర్ఎస్ కు వ‌చ్చిన నాయ‌కుడు ఇటీవ‌లే బీజేపీలో చేరారు. కానీ అంత‌లోనే ఆయ‌న తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. 

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం, వాయిదా

కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా కోమ‌టిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండేవారు. కానీ ఆయ‌న ఇటీవ‌ల కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. అలాగే త‌న ఎమ్మెల్యే ప‌ద‌విని కూడా వ‌దులుకున్నారు. దీంతో అక్క‌డ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. కాంగ్రెస్ నుంచి తెగ‌దింపులు చేసుకున్న రాజ్ గోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. అయితే ఈ ఎన్నిక‌లు 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల కంటే కొంచెం ముందుగానే జ‌ర‌గనున్నాయి. ఈ నేప‌థ్యంలో అన్ని పార్టీలు ఈ ఎన్నిక‌ల‌ను ప్రతిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నాయి. 

తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యూత్ కాంగ్రెస్ పిలుపు:ముందస్తు అరెస్టులు

ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ దీనిని త‌న ఖాతాలో వేసుకోవాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. బీజేపీ కూడా ఈ సీటును ఎలాగైనా తామే గెల‌వాల‌ని చూస్తోంది. ఇక ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి ఆ నియోజ‌క‌వ‌ర్గంలో క్యాడర్ ఉంది. కాబ‌ట్టి ఆ పార్టీ తిరిగి త‌మ అభ్య‌ర్థే మునుగోడు ఎమ్మెల్యే కావాల‌ని ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది.