అగ్నిపర్వతం బద్దలై 25 మంది సజీవ దహనం, పలువురిగా గాయాలు

At Least 25 People Killed In Guatemala   Volcano Eruption
Highlights

లావాలో చిక్కుకొని 25 మంది మృతి

At Least 25 People Killed In Guatemala
Volcano Eruption

అగ్నిపర్వతం బద్దలై 25 మంది సజీవ దహనం, పలువురిగా
గాయాలు

గ్వాటెమాల:  గ్వాటెమాలలో అగ్నిపర్వతం బద్దలైంది.
అగ్నిపర్వతం నుండి లావాలో చిక్కుకొని 25 మంది సజీవ
దహనం చేశారు. మరో 20 మంది  తీవ్రంగా గాయపడ్డారు.


గ్వాటెమాలాలో ఘోర ప్రమాదం సంభవించింది.
అగ్నిపర్వతం బద్దలవడంతో ఆ లావాలో చిక్కుకుని 25
మంది సజీవదహనమయ్యారు. మరో 20 మందికి పైగా
గాయపడ్డారు. 

సెంట్రల్‌ అమెరికా ప్రాంతంలోని అతిపెద్ద అగ్నిపర్వతాల్లో
ఒకటైన ఫ్యూగో అగ్నిపర్వతం ఆదివారం బద్దలైంది. దీంతో
పెద్ద పెద్ద రాళ్లు ఎగిరి పడుతున్నాయి. దట్టమైన పొగ
వ్యాపించింది. అగ్నిపర్వతం నుంచి లావా ఎగసిపడి
సమీపంలోని గ్రామాల వరకు వ్యాపించింది. ఈ లావాలో
పలువురు స్థానికులు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 25 మంది మృతిచెందారు.
మరో 20మందికి పైగా గాయపడినట్లు వెల్లడించారు.

అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా ఎల్‌ రోడియో
గ్రామంలోని ఓ ఇంటిపై పడటంతో మంటలు తలెత్తాయి. ఈ
మంటల్లో చిక్కుకుని నలుగురు వ్యక్తులు
సజీవదహనమయ్యారు. వీరిలో విపత్తు ఏజెన్సీకి చెందిన
అధికారి కూడా ఉన్నారు. ఇక మరో ఇద్దరు చిన్నారులు
వంతెనపై నిల్చుని ఉండగా లావా పడి మృతిచెందారు.

పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అగ్నిపర్వతం సమీపంలోని
గ్రామాలకు చెందిన 2వేల మందిని అధికారులు సురక్షిత
ప్రాంతాలకు తరలించారు. 

అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద
సముద్రమట్టానికి 12,346 అడుగుల ఎత్తు వరకు
ఎగిసిపడుతోంది. దీంతో గ్వాటెమాలా సిటీలోని అంతర్జాతీయ
విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
గ్వాటెమాలాలో ఈ ఏడాది బద్దలైన అగ్నిపర్వాతాల్లో ఇది
రెండోది. 

loader