బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచే సీఎంలు - ఈటల రాజేందర్
బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ అధ్యక్షులుగా కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తే ఉంటారని తెలిపారు. ఆ పార్టీ తెలంగాణ అధికారంలో ఉన్నంత కాలం ఆ ఫ్యామిలీకి చెందిన వ్యక్తే సీఎం అవుతారని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచే ఒకరు ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ నాయకుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఇతర వర్గాలకు చెందిన వ్యక్తులను అవకాశం దొరకదని తెలిపారు. అలాగే పార్టీ చీఫ్ లుగా కూడా ఆ ఫ్యామిలీ నుంచే ఉంటారని విమర్శించారు. ఇవన్నీ వాస్తవాలని తెలిపారు.
కర్ణాటకలో మా ఒక్కో ఎమ్మెల్యేకు బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్ చేసింది - కాంగ్రెస్
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కే. లక్షణ్ తో కలిసి ఈటల రాజేందర్ హైదరాబాద్ లో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల ఇన్ ఛార్జ్ లు గా కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచే ఉంటారని అన్నారు. ఇతర వ్యక్తులకు, కుటుంబ సభ్యులకు ఛాన్స్ ఇవ్వబోరని ఆరోపించారు.
శంషాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. ఫుట్ వేర్ షాప్ కమ్ గోదామ్ లో చెలరేగిన మంటలు..
స్వరాష్ట్రం వస్తే బడుగు, బలహీనులకు అధికారం వస్తుందని, వారి జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పారని అన్నారు. కానీ కేవలం ఒకే ఒక్క ఫ్యామిలీలోనే వెలుగు నిండిందని ఈటల విమర్శించారు. వారికే పదవులు వచ్చాయని ఆరోపించారు. అయితే వారికి అధికారం కట్టబెట్టిన ప్రజల బతుకులు ఆగమైపోయాయని తెలిపారు. రాజ్యాధికారంలో భాగం ఇస్తానని బీఆర్ఎస్ ఎస్టీలను మోసం చేసిందని ఆరోపించారు.
రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం - ముఖేష్ అంబానీకి బెదిరింపు
బీఆర్ఎస్ కు బీసీలంటే చులకన భావం అని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆ పార్టీకి బీసీలంటే చిన్నచూపని అన్నారు. అయితే బీజేపీ దేశానికి ప్రధానిగా బీసీ బిడ్డను అందించిందని తెలిపారు. అలాగే ఓ గిరిజన బిడ్డను రాష్ట్రపతి చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో డెబ్బై శాతానికి పైగా బలహీన వర్గాలకు అవకాశం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు.
మామ మూడో సారి సీఎం అవుతారు.. పవర్ మన చేతిలోనే ఉంటుంది - ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ
అనంతరం కే.లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అన్నారు. అలాగే దళితులను సీఎం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ ఎస్సీలను మోసం చేసిందని విమర్శించారు. బీసీలను ఆ రెండు పార్టీలు మోసం చేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఓ బీసీ బిడ్డను సీఎం చేస్తామని మొదటి సారిగా బీజేపీ ప్రకటించిందని స్పష్టం చేశారు. తమ పార్టీని గెలిపిస్తే బీసీ వ్యక్తి సీఎం కుర్చీలో కూర్చుంటారని తెలిపారు.