రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం - ముఖేష్ అంబానీకి బెదిరింపు

రూ.20 కోట్లు ఇవ్వాలని లేకపోతే చంపేస్తామని భారత కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. దీనిపై ఆయన సెక్యూరిటీ ఇంచార్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

We will kill you if you don't pay Rs 20 crore - Threatening e-mail to Mukesh Ambani..ISR

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి ఈ-మెయిల్ ద్వారా ప్రాణహాని బెదిరింపు వచ్చింది. ఆయన ఐడీకి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఓ మెయిల్ వచ్చింది. అందులో తమకు రూ.20 కోట్లు చెల్లించాలని, లేదంటే చంపేస్తామని హెచ్చరించాడు. ‘‘ మాకు రూ.20 కోట్లు ఇవ్వు. లేకపోతే చంపేస్తాం. భారత్ లో మాకు అత్యుత్తమ షూటర్లు ఉన్నారు’’ అని మెయిల్ లో పేర్కొన్నాడు. 

1995లో కేసీఆర్ కు నేనే మంత్రి పదవి ఇప్పించా.. పాలేరులో పార్టీ శ్రేయస్సు కోసమే పోటీ చేశా - తుమ్మల నాగేశ్వరరావు

దీంతో ముఖేశ్ అంబానీ సెక్యూరిటీ ఇంచార్జ్ ముంబైలోని గాందేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుర్తుతెలియని వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 387 (ప్రాణభయం లేదా తీవ్రంగా గాయపరచడం), 506 (2) (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కాగా.. ముఖేష్ అంబానీకి హత్యా బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది కూడా అంబానీకి, ఆయన కుటుంబ సభ్యులకు హత్యా బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ ఘటనలో బీహార్ లోని దర్భంగాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిరుద్యోగి అయిన నిందితుడిని రాకేష్ కుమార్ మిశ్రాగా గుర్తించారు. అతడు ముఖేశ్ అంబానీ కుటుంబాన్ని, ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ ను పేల్చివేస్తానని బెదిరించాడు.

అత్యాచారాలు, దోపిడీల్లో ముస్లింలు నెంబర్ 1 - ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు

అలాగే 2021లో 20 పేలుడు జిలెటిన్ స్టిక్స్, బెదిరింపు లేఖతో కూడిన స్కార్పియో కారు దక్షిణ ముంబై నివాసం అంటిలియా వెలుపల ఉండటం కలకలం రేకెత్తించింది. అందులో ఓ లేఖ లభించింది. ఆ లేఖలో ‘యే సిర్ఫ్ ట్రైలర్ హై (ఇది కేవలం ట్రైలర్ మాత్రమే).’ అని రాసి ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios