Asianet News TeluguAsianet News Telugu

మామ మూడో సారి సీఎం అవుతారు.. పవర్ మన చేతిలోనే ఉంటుంది - ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఓవైసీ

ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోటే అభివృద్ధి ఉంటుందని ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తెలంగాణకు మూడో సారి కూడా కేసీఆర్ సీఎం అవుతారని చెప్పారు.  బీజేపీ, కాంగ్రెస్ లు రెండు అవిభక్త కవలలని ఆరోపించారు.

Mama will become CM for the third time.. Power will be in our hands - MIM chief Asaduddin Owaisi..ISR
Author
First Published Oct 28, 2023, 2:03 PM IST

సీఎం కేసీఆర్ మూడో సారి సీఎం అవుతారని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ధీమా వ్యక్తం చేశారు. తాము పవర్ ప్లే మొదలు పెట్టామని అన్నారు. తరువాత పవర్ తమ చేతిలోనే ఉంటుందని చెప్పారు. బీజేపీ కుల గణన ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లో ఏఐఎంఐఎం పార్టీ శుక్రవారం రాత్రి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు.

కర్ణాటకలో మా ఒక్కో ఎమ్మెల్యేకు బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్ చేసింది - కాంగ్రెస్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ లు రెండు అవిభక్త కవలలని ఆరోపించారు. అవి రెండు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలనే అనుసరిస్తాయని విమర్శించారు. టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి కు ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం ఉందని అన్నారు. అక్కడి నుంచి ఆయన కాంగ్రెస్ లోకి వచ్చారని తెలిపారు. అందుకే వచ్చే ఎలక్షన్ లో ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ కు  సరైన తీరుగా బదులివ్వాలని కోరారు. 

అత్యాచారాలు, దోపిడీల్లో ముస్లింలు నెంబర్ 1 - ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో మామకు (బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్) కు సపోర్ట్ గా నిలవాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన పార్టీ శ్రేణులను, ప్రజలను కోరారు. మామ మూడో సారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ పార్టీల కంటే, ప్రాంతీయ పార్టీలు ఉన్న చోటనే డెవలప్ మెంట్ ఎక్కువగా జరుగుతుందని చెప్పారు. 

మన రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ లో మూడు పార్టీలు పోటీ పడుతున్నాయని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. నాలుగో పార్టీ ఎంఐఎం కూడా ఉందని ఆయన తెలిపారు. తాము ఇప్పటికే పవర్ ప్లే స్టార్ట్ చేశామని తెలిపారు. సీఎం కేసీఆర్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. పవర్ తమ చేతిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చి.. ఇక్కడ బీజేపీ గెలిస్తే బీసీని సీఎం చేస్తానని చెబుతున్నారని అన్నారు. బీసీని సీఎం చేసే బీజేపీ.. కుల గణన ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీజేపీపై, కాంగ్రెస్ పై పలు విమర్శలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios