ప్రియుడు, ప్రియురాలు. భర్త... మటన్ సూఫ్

ప్రియుడు, ప్రియురాలు. భర్త... మటన్ సూఫ్

నాగర్ కర్నూల్ లో ప్రియుడు రాజేష్ తో కలిసి భర్తను హత్య చేసిన స్వాతి విచారణలో సంచలన నిజాలు బైటపడుతున్నాయి. భర్తను ఎలా చంపింది, ఆ తర్వాత జరిగిన నాటకం, ఎలా పట్టుబడిందన్న విషయాలను స్వాతి పోలీసులు విచారణలో బైటపెట్డింది.

వారు చేసిన ఓ చిన్న తప్పు మొత్తం బండారాన్ని బైటపెట్టింది.

నాగర్ కర్నూలు పట్టణంలో ప్రియుడి సాయంతో స్వాతి భర్త సుధాకర్ రెడ్డిని చంపేసిన విషయం తెలిసిందే.  ఆ తర్వాత భర్త ప్లేస్ లో ప్రియుడు రాజేష్ ను పెట్టి యాసిడ్ నాటకమాడి కుటుంబసభ్యులను నమ్మించింది స్వాతి. అయితే చివరకు ఆ నాటకం ఎలా బైటపడి కలకటాలపాలైన స్వాతి పోలీసుల విచారణలో  నిజాలను బైటపెట్టింది.

యాసిడ్ దాడి తర్వాత తమ కుమారుడే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని సుధాకర్ రెడ్డి తల్లి భావించింది. కోడలికి తోడుగా ఆమె కూడా ఆస్పత్రిలోనే ఉంటోంది. అయితే కాలిన గాయాలు మానడానికి మటన్ సూఫ్ బాగా పనిచేస్తుందని సుధాకన్ తల్లికి ఎవరో చెప్పారు. అలాగే సుధాకర్ రెడ్డికి మటన్ అంటే బాగా ఇష్టం కూడా కావడంతో తల్లి మటన్ సూఫ్ చేసి ఆస్పత్రికి తీసుకువచ్చింది. అయితే సుధాకర్ రెడ్డి స్థానంలోని రాజేష్ ప్యూర్ వెజిటేరియన్ కావడంతో ఆ సూప్ తాగడానికి నిరాకరించాడు. మాంసాహారం ఇష్టంగా తినే సుధాకర్ ఇలా కాదనడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

ఇంత నాటకానికి ప్లాన్ చేసిన స్వాతి తన భర్త ఆహార అలవాట్లను రాజేష్ కు చెప్పలేదు. దీంతో మటన్ సూఫ్ వారి నాటకాన్ని బైట పెట్టింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos