ప్రియుడి కోసం భర్తను హతమార్చిన మహిళ కేసులో కొత్త ట్విస్ట్

First Published 11, Dec 2017, 1:37 PM IST
Woman and her paramour arrested for Killing Husband
Highlights
  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ 
  • నాగర్ కర్నూల్ లో దారుణం
  •  

నాగర్ కర్నూలు లో సుధాకర్ రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. భర్తను హతమార్చి దారుణానికి ఒడిగట్టడమే కాకుండా, ప్రియుడినే తన భర్తగా నమ్మించి సినీ పక్కీలో అందరిని మోసం చేసింది.  చివరికి భర్త హత్య, నాటకం బయటపడటంతో ప్రియుడితో పాటు సదరు మహిళ  కటకటాల పాలయ్యింది.  

 

వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూల్ కు చెందిన సధాకర్ రెడ్డికి  స్వాతి అనే యువతితో వివాహమైంది. అయితే  వ్యాపార పనుల నిమిత్తం సుధాకర్ రెడ్డి తరచూ వేరే ఊళ్లకు వెళుతుండేవాడు. దీన్ని అదునుగా తీసుకుని స్వాతి , రాజేష్ అనే ఫిజియోథెరపిస్ట్ తో వివాహేతర సంభందం పెట్టుకుంది. భర్త లేని సమయంలతో తరచూ కలుస్తుండేవారు. అయితే ఆమె ప్రవర్తనలో మార్పు గమనించిన భర్త అనుమానం వచ్చి నిఘా పెట్టగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్తకు స్వాతికి మద్య గొడవ జరిగింది. దీంతో స్వాతి భర్తను హతలమార్చి ప్రియుడితో ఉండాలని నిర్ణయించుకుంది. దీనికోసం సినీ పక్కీలో ఓ నాటకానికి తెరలేపింది.

ప్రియుడు రాజేష్ తో కలిసి భర్త సుధాకర్ రెడ్డిని రాడ్ తో కొట్టి చంపిన వీరు అతడి శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా మాయం చేశారు. అక్కడి నుండి అసలు నాటకాన్ని మొదలుపెట్టారు. తన భర్త ముఖంపై యాసిడ్ పడి ముఖం గుర్తుపట్టరాకుండా అయ్యిందని,ప్రస్తుతం అతడు హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడని స్వాతి బందువులకు తెలిపింది. భర్త స్థానంలో రాజేష్ ను పెట్టి ముఖంకు ప్లాస్టర్ చుట్టి ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్త పడింది. అయితే సుధాకర్ రెడ్డిని పరామర్శించేందుకు అతని అన్న సురేందర్ రెడ్డి, తల్లి సుమతమ్మ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్నది సుధాకర్ రెడ్డి కాదని గుర్తించిన వారు నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో చికిత్స పొందుతున్న వ్యక్తి వేలిముద్రలు సేకరించిన పోలీసులు, అతను సుధాకర్ రెడ్డి కాదని, రాజేష్ అని నిర్ధారణకు వచ్చారు. వెంటనే స్వాతిని అదుపులోకి తీసుకొని విచారించారు. రాజేష్‌తో కలిసి భర్తను హతమార్చి మృతదేహాన్ని కాల్చినట్లు అంగీకరించింది.

దీంతో  పోలీసులు సుధాకర్ రెడ్డిని దహనం చేసిన స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరించారు.ఈ హత్య కేసులో రాజేష్, స్వాతిలను నిందితులుగా చేర్చి కేసు నమోదు చేశారు. స్వాతి ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండుకు తరలించారు. రాజేష్‌ను అదుపులోకి తీసుకొని విచారించనున్నారు.

 

 

 

loader