Asianet News TeluguAsianet News Telugu

దుబాయ్ లో మరో తెలంగాణ బిడ్ద మృతి

  • దుబాయ్ లో మరో తెలంగాణ వాసి మృతి
  • నెల రోజుల క్రితమే దుబాయ్ కి వెళ్లిన మృతుడు
another telangana gulf worker dies in Dubai

ఎన్నో ఆశలతో విదేశి గడ్డపై అడుగుపెడుతున్నారు. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ అక్కడ నానా చాకిరి చేస్తున్నారు. తాము కష్టపడ్డా తమ కుటుంబాలు సుఖంగా ఉంటాయన్న ఆశతో అక్కడే బతుకీడుస్తున్నారు. అయితే దేశం కాని దేశానికి వెళ్లి అక్కడ కష్టాల పాలవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న తెలంగాణ గల్ఫ్ బాధితులను చూశాం. అలా కాకుండా మానసిక వేధన అనుభవించి అనారోగ్యంతో చనిపోతున్న వారు కూడా ఉన్నారు. అలాంటి మరణమే తాజాగా దుబాయ్ లో సంభవించింది.

వివరాల్లోకి వెళితే  జగిత్యాల జిల్లా యశ్వంతరావు పేట గ్రామానికి చెందిన మరికట్టి రాజయ్య, ధర్మవ్వ ల కొడుకు గంగయ్య. అతడు నెల రోజుల కింద విజిటింగ్ వీసాపై ఉపాది కోసం దుబాయ్ కి వెళ్లాడు. అక్కడ తనకు తెలిసిన వారితో కలిసి రూం లో ఉంటున్నాడు. అయితే బుధవారం అర్దరాత్రి 2 గంటలకు అతడు తీవ్ర గుండె పోటుకు గురయ్యాడు. దీంతో  రూమ్ మెంట్స్ అతడిని దగ్గర్లోని ఆసుపత్రి కి తరలించారు. ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఇవాళ గంగయ్య మృతి చెందాడు.    గంగయ్య  మృతిచెందినట్లు అతడి రూమ్మెట్స్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు.  చేతికి అందివచ్చిన కొడుకు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కొడుకు మృతదేహాన్ని స్వదేశానికి  తీసుకురాడానికి  సహకరించాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.  

అయితే ఇటీవల ఇలా గల్ఫ్ బాధితుల మరణాలు ఎక్కువయ్యాయి. స్వదేశంలో ఉపాధి లభించక అప్పో సొప్పో చేసి విదేశాలకు వెళుతుంటారు. ఇలాంటి వారు హటాత్తుగా చనిపోవడంతో వారి కుటుంబాలకు అండ లేకుండా పోతుందని భాదితులు వాపోతున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ పాలసీని తీసుకువచ్చి తమను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం గత కొంత కాలంగా తాము ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం గల్ఫ్ భాధితులకు అండగా నిలిచి, ఇలా చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios