మరో తెలంగాణ రైతు ఆత్మహత్య

First Published 28, May 2018, 3:57 PM IST
another telangana farmer suicide
Highlights

జడ్చర్లలో విషాదం

తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు సర్కారు రైతు బంధు, రైతు బీమా పథకాల పేరుతో హడావిడి చేస్తుంటే మరోవైపు సర్కారు చర్యలు తమను ఆదుకునే పరిస్థితి లేదని అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా పాలమూరు జిల్లాలో ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం గంగాపూర్ లో మల్లయ్య (60) అనే రైతు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైతుబంధు పథకం ద్వారా చేతికందిన రూ. 40 వేలు మాయం కావడంతో మనస్థాపానికి గురై అఘాయిత్యానికి పాల్పడ్డట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆత్మహత్యకు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

loader