కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రాజ్ గోపాల్ రెడ్డి చేజారిపోవడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని తెలుస్తుండగా.. ఇప్పుడు వెంకట్ రెడ్డి కూడా బీజేపీలో చేరితే పార్టీకి మరింత గడ్డు పరిస్థితులు ఎదురుకావచ్చు.
కాంగ్రెస్ ను వలసలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే పార్టీ బలమైన నేత కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు.ఆ షాక్ నుంచి ఆ పార్టీ తేరుకోకముందే మరో నాయకుడు కూడా కాంగ్రెస్ ను వీడనున్నట్టు సమాచారం. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సోదరుడు అయిన వెంకట్ రెడ్డి కూడా ఇప్పుడు బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
క్లర్క్ ఇంట్లో రూ. 85 లక్షల నగదు, కోట్ల విలువైన పత్రాలు, సోదాలకు వెడితే విషం తాగి...
రెండు రోజుల క్రితమే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే తన పదవికి, అలాగే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత కొంత కాలం నుంచి ఆయన పార్టీని వీడుతారని చర్చ జరుగుతోంది. పలు సందర్భాల్లో మీడియా ముఖంగా ఆయన దానిని ఖండించినా చివరికి పార్టీని వీడారు. అయితే ఈ విషయంలో రాజ్ గోపాల్ రెడ్డి ఏడాది కాలంగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అప్పటి నుంచే ఆయన పార్టీపై సంతృప్తిగా లేరు. కాగా ఈ విషయం రాష్ట్ర నాయకత్వానికి తెలిసినా సరిగా పట్టించుకోలేదు. ఆయనను పార్టీలో కొనసాగించే విషయంపై మాణిక్కం ఠాగూర్ కూడా ఇంట్రెస్ట్ చూపలేదని తెలుస్తోంది. ఈ విషయంలో ఉమ్మడి నల్గొండకు చెందిన సీనియర్ నాయకులు నేరుగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు కంప్లైంట్ ఇచ్చారు.
ఈ నెల 7 న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తా.. ఎర్రబెల్లి ప్రదీప్ రావు
రాజ్ గోపాల్ రెడ్డి పార్టీ మారిన సందర్భంలో టీపీసీసీ ప్రెసిడెంట్.. కోమటిరెడ్డి ఫ్యామిలీని కించపరిచేలా మాట్లాడారని తెలుస్తోంది. దీంతో రాజ్ గోపాల్ రెడ్డి సోదరుడు వెంకట్ రెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ ను వీడటం వల్ల ఆ పార్టీకి మూడు నియోజకవర్గాల్లో నష్టం జరుగుతుందని అంచనా. అయితే ఇప్పుడు అతడి సోదరుడు కూడా పార్టీని వీడితే దీని ప్రభావం కనీసం 6 నియోజకవర్గాలపై పడుతుందని నల్గొండ కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ వద్ద తెలియజేశారని తెలుస్తోంది.
వరంగల్ లో నకిలీ డాక్టర్.. నాలుగేళ్లలో 43వేలమందికి వైద్యం...
మునుగోడు ఎమ్మెల్యే చాలా కాలంగా పార్టీ పట్ల సంతృప్తిగా లేరని, ఆయనను పార్టీలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తాము ఠాగూర్‌కు సంవత్సరం కిందనే చెప్పామని గోపాల్ రెడ్డి వద్ద ప్రస్తావించామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ విషయాన్ని భట్టి, ఉత్తమ్, జానా, శ్రీధర్ బాబు వంటి లీడర్లు కూడా మణిక్కం వద్ద ప్రస్తావించారని, కానీ ఆయన వినిపించుకోలేదని అన్నారు. ఇదిలా ఉండగా.. పార్టీలో నుంచి మరి కొందరు నేతలు చేజారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ లీడర్స్ జానారెడ్డి తనయుడిని కూడా పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ లీడర్లు ఆందోళన చెందుతున్నారు.
