Asianet News TeluguAsianet News Telugu

Telangana Omicron Cases: హైదరాబాద్ లో మరో యువకుడికి ఒమిక్రాన్... 25కు చేరిన కేసులు

తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. తాజాగా హైదరాబాద్ లో మరో యువకుడికి  ఒమిక్రాన్ సోకినట్లు నిర్దారణ అయ్యింది. 

another omicron case in hyderabad
Author
Hyderabad, First Published Dec 22, 2021, 7:42 PM IST

హైదరాబాద్: తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఒమిక్రాన్ కేసుల విషయంలో దేశంలోనే మూడో స్థానంలో వున్న తెలంగాణలో మరో కేసు బయటపడింది. రాజధాని హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ఓ  యువకుడిక(23ఏళ్లు) ఒమిక్రాన్ నిర్దారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. సూడాన్ నుండి ఇటీవలే హైదరాబాద్  కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

ఒమిక్రాన్ నిర్దారణ కాగానే సదరు యువకుడిని గచ్చబౌలిలోని టిమ్స్ కు తరలించారు. అలాగే అతడు నివాసమున్నఇంటిచుట్టుపక్కల ప్రాంతాలతో పాటు కాలనీలో శానిటేషన్ చేపట్టారు. ఇప్పటికే వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు...  కాలనీలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారిణి నాగజ్యోతి తెలిపారు. తాజా కేసుతో కలిసి రాష్ట్రంలో కేసుల సంఖ్య 25కు చేరింది. 

read more  Omicron: భారత్‌లో 213కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. దేశంలో క‌రోనా ప‌రిస్థితిపై రేపు ప్ర‌ధాని మోదీ స‌మీక్ష‌..

మరోవైపు భారత్‌లోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉదయం నాటికి దేశంలో ఒమిక్రాన్ కేసుల (Omicron Cases In India) సంఖ్య 200 మార్కును దాటాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union Health Ministry)ప్రకటించింది. 

ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడినవారిలో 90మది కోలుకున్నట్టుగా తెలిపింది. ఈ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీల నుంచి బయటపడినవే. ఈ రెండు రాష్ట్రాలు ఒమిక్రాన్ కేసుల్లోనూ, రికవరీలోనూ మొదటి రెండు స్థానాల్లో వున్నాయి. ఆ తర్వాత కేసుల విషయంలో తెలంగాణ మూడోస్థానంలో నిలిచింది. అయితే ఇప్పటివరకు ఒక్కరు కూడా రికవరీ కాలేదు.  

హైదరాబాద్ లో ఒమిక్రాన్ బాధితుల కాంటాక్ట్ పర్సన్స్‌లో వైరస్ వెలుగుచూసింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్‌కు ఒమిక్రాన్‌ సోకింది. ఇతర దేశాల నుంచి వచ్చిన ఒమిక్రాన్‌ బాధితుడికి వైద్యం చేశాడో డాక్టర్. దీంతో ఆయనకు కోవిడ్ సోకింది. అనంతరం ఆయన శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్‌కు పంపగా ఒమిక్రాన్‌గా తేలింది. దీంతో ఆ డాక్టర్‌తో పాటు ఆసుపత్రిలో కాంటాక్ట్స్ అయిన అందరినీ క్వారంటైన్‌కు పంపింది యాజమాన్యం. 

read more  ఒమిక్రాన్‌ అందరి ఇళ్లకు చేరుతుంది.. బహుశా చెత్త దశను చూడొచ్చు.. బిల్‌గేట్స్ హెచ్చరిక

ఇక, దేశంలో 213 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. ఢిల్లీలో 57, మహారాష్ట్రలో 54, తెలంగాణలో 24, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14, కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో 2, ఒడిశాలో 2, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో 2, ఆంధ్ర‌ప్ర‌దేశ్, ఛండీగఢ్‌, లద్దాఖ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్కటి చొప్పున కేసులు ఉన్నాయి. అయితే ఒమిక్రాన్ బారినపడ్డ వారిలో ఇప్పటివరకు 90 మంది కోలుకున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

ఇక, గ‌త 24 గంట‌ల్లో భార‌త్ లో  కొత్త‌గా 6,317 మందికి క‌రోనా నిర్దారణ అయిందని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో  దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,47,58,481 కి చేరింది. ఇదే స‌మ‌యంలో కొత్త‌గా 6,906 మంది బాధితులు కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. మొత్తం క‌రోనా రిక‌వ‌రీల సంఖ్య 3,42,01,966కు పెరిగింది. దేశంలో ప్ర‌స్తుతం 78,190 యాక్టివ్‌ కేసులున్నాయి. అలాగే, గ‌త 24 గంట‌ల్లో క‌రోనా మ‌హ‌మ్మారితో 318 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కోవిడ్‌-19 మ‌ర‌ణాల సంఖ్య 4,78,325కు పెరిగింది. క‌రోనా రిక‌వ‌రీ రేటు 98.4 శాతంగా ఉంది. మ‌ర‌ణాల రేటు 1.35 శాతంగా ఉంది. 


 
 

Follow Us:
Download App:
  • android
  • ios