Hyderabad: రాష్ డ్రైవింగ్ విష‌యంలో బైకు ను చూసి న‌డ‌పాల‌ని చెప్పినందుకు ఓ 16 ఏండ్ల బాలుడిపై క‌త్తితో దాడి జ‌రిగింది. హైద‌రాబాద్ లో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న గురించి బాధితుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంలో వెలుగులోకి వ‌చ్చింది.  

16-year-old stabbed in Hyderabad: రాష్ డ్రైవింగ్ విషయంలో జరిగిన గొడవలో 16 ఏళ్ల బాలుడిపై క‌త్తితో దాడి చేశారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ లో చోటుచేసుకుంది. పాత‌బ‌స్తీతో ఇద్ద‌రు యువకులు 16 ఏండ్ల బాలిడిపై బుధ‌వారం రాత్రి క‌త్తితో దాడిచేశార‌ని పోలీసు వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

వివరాల్లోకెళ్తే.. రాష్ డ్రైవింగ్ విష‌యంలో బైకు ను చూసి న‌డ‌పాల‌ని చెప్పినందుకు ఓ 16 ఏండ్ల బాలుడిపై క‌త్తితో దాడి ఘ‌ట‌న పాత‌బ‌స్తీలోని ఫ‌ల‌క్ నుమాలో చోటుచేసుకుంది. ఈ దాడికి పాల్ప‌డిన ఇద్ద‌రు బాల నేర‌స్థుల‌ని స‌మాచారం. బాధిత బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడగా, నిందితులు పరారీలో ఉన్నారు. గురువారం తెల్లవారుజామున మైలార్ దేవ్ పల్లిలోని ఒవైసీహిల్స్ కు చెందిన వెల్డర్ మహబూబ్ ఖాన్ (31) ఓవైసీ హిల్స్ కు చెందిన హైస్కూల్ విద్యార్థి అయిన తన మేనల్లుడు (16)పై అర్ధరాత్రి ఒంటిగంటకు త‌న‌పై దాడి జ‌రిగింద‌ని తనకు తెలిపిన‌ట్టు పేర్కొన్నారు. చుట్టుపక్కల నుంచి వచ్చిన ఇద్దరు యువకులు తనను కత్తితో పొడిచారని ఫలక్ నుమా పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. 

పోలీసులు దర్యాప్తు చేపట్టగా అచ్చిరెడ్డి నగర్ లో మెడికల్‌ షాపుకు వెళ్లి మందులు కొని తిసుకుని వెళ్తుండగా బైక్ పై వచ్చిన ఇంటర్మీడియట్ విద్యార్థి అతన్ని ఢీకొట్టినట్లు గుర్తించారు. ఇద్దరు యువకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బాధితుడు అదే ప్రాంతంలో ఉండ‌గా, గొడ‌వ‌ప‌డ్డ 17 ఏళ్ల యువ‌కుడు త‌న స్నేహితునితో క‌లిసివ‌చ్చి మళ్లీ వాగ్వాదానికి దిగారు. ఈ క్ర‌మంలోనే బైకర్ బాలుడి వీపుపై కత్తితో పొడిచాడు. అతడు కేకలు వేయడంతో చుట్టుప‌క్క‌ల వారు రావ‌డంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన మైనర్లను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.