Asianet News TeluguAsianet News Telugu

మారుతీ రావు అంత్యక్రియలు: శ్మశానవాటికకు బయలుదేరిన అమృత

తన తండ్రిని కడసారి చూసేందుకు మారుతీ రావు కూతురు అమృత వర్షిణి శ్మశానవాటికకు చేరుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె శ్మశానవాటికకు బయలుదేరారు. భర్త ప్రణయ్ హత్య తర్వాత ఆమె మారుతీరావును చూడలేదు.

Amrutha Varshini to burial ground to attend his father's last rites
Author
Miryalaguda, First Published Mar 9, 2020, 11:45 AM IST

మిర్యాలగుడా: తన తండ్రిని కడసారి చూసేందుకు మారుతీరావు కూతురు అమృత వర్షిణి శ్మశానవాటికకు బయలుదేరారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె సోమవారం ఉదయం శ్మశానవాటికకు బయలుదేరారు.

మారుతీరావు అంత్యక్రియలు హిందూ శ్మశానవాటికలో జరుగుతున్న విషయం తెలిసిందే. అమృత వర్షిణి భర్త ప్రణయ్ ను మారుతీ రావు చంపించాడు. అప్పటి నుంచి ఆమె తన తండ్రిని చూడలేదు. ప్రణయ్ హత్య తర్వాత తండ్రి కోరినప్పటికీ మారుతీ రావు వద్దకు వెళ్లడానికి అమృత ఇష్టపడలేదు. 

also Read: కూతురిపై ప్రేమతోనే మారుతీ రావు ఆత్మహత్య: ప్రణయ్ హత్య కేసు నిందితుడు కరీం

అయితే, తండ్రి మారుతీరావును కడసారి చూస్తానని ఆమె చెప్పడంతో బాబాయ్ శ్రవణ్ వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అమృత తమను సంప్రదించలేదని, తాను అందుకు నిరాకరించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని శ్రవణ్ చెప్పారు. ఈ స్థితిలో ఆమె శ్మశాన వాటికకు బయలుదేరినట్లు తెలుస్తోంది.

మారుతీ రావు హైదరాబాదులోని ఆర్యవైశ్య భవన్ లోని గదిలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. గారెల్లో విషం కలుపుకుని అతను తిన్నాడని తేలింది. తన కూతురు అమృత వర్షిణి దళితుడైన ప్రణయ్ ను ప్రేమ వివాహం చేసుకోవడం అతని నచ్చలేదు. దీంతో కక్ష కట్టి ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించాడు. 

Also Read: అమృతను వద్దని చెప్పలేదు: మారుతీరావు తమ్ముడు శ్రవణ్ క్లారిటీ

ఆ కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లి బెయిల్ మీద విడుదలయ్యారు. ప్రణయ్ హత్య కేసు ట్రయల్స్ కోర్టులో తుది దశలో ఉన్నాయి. తనకు శిక్ష తప్పదనే భయంతోనే కాకుండా కూతురు తన వద్దకు రావడం లేదనే మనస్తాపంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios