Asianet News TeluguAsianet News Telugu

కూతురిపై ప్రేమతోనే మారుతీ రావు ఆత్మహత్య: ప్రణయ్ హత్య కేసు నిందితుడు కరీం

హత్య కేసులో నిందితుడు, కాంగ్రెసు నాయకుడు కరీం స్పందించాడు. కూతురు అమృత వర్షిణిఫై ప్రేమను చంపుకోలేక మారుతీ రావు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఆయన మారుతీరావు మృతిపై స్పందించాడు

Accused in Pranay murder case reacts on Maruthi Rao's death
Author
Miryalaguda, First Published Mar 9, 2020, 11:17 AM IST

మిర్యాలగుడా: అమృత వర్షిణి తండ్రి మారుతీ రావు ఆత్మహత్యపై ప్రణయ్ హత్య కేసు నిందితుడు, కాంగ్రెసు నాయకుడు కరీం స్పందించాడు. కూతురు అమృతవర్షిణిపై ప్రేమతోనే మారుతీరావు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని ఆయన అన్నాడు. 

మారుతీరావుకు ఆర్థిక సమస్యలేవీ లేవని ఆయన స్పష్టం చేశారు. మారుతీ రావు కుటుంబంలో ఆస్తి తగాదాలు కూడా ఏమీ లేవని అన్నారు. మారుతీ రావు కూతురు అమృత ఆయనకు ఇష్టం లేకుండా దళితుడైన ప్రణయ్ ను వివాహం చేసుకుంది. ఆ కోపంతో కక్ష పెంచుకుని మారుతీ రావు ప్రణయ్ ను హత్య చేయించాడు.

Also Read: అమృతను వద్దని చెప్పలేదు: మారుతీరావు తమ్ముడు శ్రవణ్ క్లారిటీ

ప్రణయ్ హత్యకు పథక రచన చేసి అమలు చేయడంలో కరీం పాత్ర ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించుకుని కేసు నమోదు చేశారు. కేసు విచారణ కోర్టులో తుది దశకు చేరుకుంది. 

మారుతీ రావు హైదరాబాదులోని ఖైరతాబాద్ లో గల ఆర్యవైశ్య భవన్ లోని గదిలో శవమై తేలాడు. అతను ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: విషమే మిస్టరీ: మారుతీ రావు మృతిపై తేల్చేసిన నిపుణులు...

మారుతీరావుతో పాటు కరీం కూడా అరెస్టయి కొంత కాలం జైలులో ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios